Last Updated:

Yuvagalam: యువగళం@100 డేస్ .. నారాలోకేష్ కు కుటుంబసభ్యుల, పార్టీ నేతల అభినందనలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనసాగిస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 100 వరోజుకు చేరుకుంది. లోకేష్ ఇప్పటికి 1200 కి.మీ. పాదయాత్ర పూర్తి చేసారు. ఈ సందర్బంగా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు లోకేష్ కు అభినందనలు తెలిపారు.

Yuvagalam: యువగళం@100 డేస్ .. నారాలోకేష్ కు కుటుంబసభ్యుల, పార్టీ నేతల అభినందనలు

Yuvagalam: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనసాగిస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 100 వరోజుకు చేరుకుంది. లోకేష్ ఇప్పటికి 1200 కి.మీ. పాదయాత్ర పూర్తి చేసారు. ఈ సందర్బంగా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు లోకేష్ కు అభినందనలు తెలిపారు. లోకేష్ తల్లి నారా భువనేశ్వరి ,నారా, నందమూరి కుటుంబ సభ్యులు లోకేష్ ను కలిసి అభినందించారు.  భువనేశ్వరి లోకేష్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీశైలం నియోజకవర్గం మోతుకూరులో లోకేష్ పైలాన్ ను ఆవిష్కరించారు. టీడీపీ నేతలు 100 మొక్కలను నాటారు.

ప్రజలకు దగ్గర చేసింది..(yuvagalam)

పాదయాత్రలో 100 రోజులు పూర్తి చేసుకున్న లోకేష్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. యువగళం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ కు శుభాకాంక్షలు. అతను రోడ్డుపై గడిపిన సమయం,ప్రజల నిజమైన సమస్యలను చూడటానికి మరియు అనుభూతి చెందడానికి అతన్ని మరింత దగ్గర చేసి ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇంకా చాలా మైళ్లు వెళ్లాలి అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు.

మరోవైపు లోకేష్ కూడా తన పాదయాత్రపై ట్వట్టర్ వేదికగా స్పందించారు. అడ్డంకుల్ని లెక్క చేయ‌లేదు. ఎండ‌ల‌కి ఆగిపోలేదు. వాన ప‌డితే చెదిరిపోలేదు. ప్ర‌జ‌ల కోసం నేను..నా కోసం ప్ర‌జ‌లు యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ని ముందుండి న‌డిపిస్తున్నారు.యువ‌గ‌ళం పాద‌యాత్ర వంద‌రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌జ‌లు, యువ‌గ‌ళం వ‌లంటీర్లు, క‌మిటీలు, తెలుగుదేశం కుటుంబ‌స‌భ్యులు, అభిమానులకు హృద‌య‌పూర్వ‌క న‌మ‌స్కారాలు. పాద‌యాత్ర‌ ప్ర‌జ‌ల యాత్ర అయింది. యువ‌గ‌ళం జ‌న‌గ‌ళ‌మైంది అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

Image

 

https://fb.watch/kxCgfvGtDC/