Last Updated:

Police Case : బట్టలు లేకుండా పోలీస్ స్టేషన్ కి పదేళ్ళ బాలుడు.. ఏం చెప్పాడో తెలిస్తే బుర్రపాడు అవ్వాల్సిందే !

ఓ పదేళ్ల బాలుడు కేవలం ఒక టవల్ చుట్టుకొని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాడు. ది కూడా తన తల్లిపై కంప్లైంట్ ఇవ్వడానికి.. చదవడానికి కొంచెం షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. మరి ముఖ్యంగా తన తల్లి పై ఎందుకు ఫిర్యాదు చేయాలని అని అనుకున్నాడో తెలిస్తే ఇక బుర్రపాడు అవ్వడం గ్యారంటీ అని తెలుస్తుంది.

Police Case : బట్టలు లేకుండా పోలీస్ స్టేషన్ కి పదేళ్ళ బాలుడు.. ఏం చెప్పాడో తెలిస్తే బుర్రపాడు అవ్వాల్సిందే !

Police Case : ఓ పదేళ్ల బాలుడు కేవలం ఒక టవల్ చుట్టుకొని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాడు. ది కూడా తన తల్లిపై కంప్లైంట్ ఇవ్వడానికి.. చదవడానికి కొంచెం షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. మరి ముఖ్యంగా తన తల్లి పై ఎందుకు ఫిర్యాదు చేయాలని అని అనుకున్నాడో తెలిస్తే ఇక బుర్రపాడు అవ్వడం గ్యారంటీ అని తెలుస్తుంది.

ఒంటి మీద చొక్కా లేకుండా కేవలం టవల్‌ చుట్టుకొని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళిన ఆ బాలుడిని ఎందుకొచ్చావని పోలీసులు ప్రశ్నించారు. అందుకు ఆ బాలుడు తన ఫ్రెండ్‌ పుట్టిన రోజుకు వెళ్లడానికి వాళ్లమ్మ చొక్కా ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ బాలుడు. నవ్వు తెప్పిస్తున్న ఈ స్టోరీ పూర్తి వివరాలు మీకోసం..

ఏలూరు జిల్లాలోని కొత్తపేటకు చెందిన సాయి దినేష్‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం అతని తల్లి అనారోగ్యంతో చనిపోయింది. దాంతో దినేష్‌ తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. తాజాగా దినేష్ తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లడానికి బయలుదేరాడు. స్నానం చేసి తన సవతి తల్లిని పుట్టినరోజు వేడుకకు వెళ్లేందుకు వైట్ షర్ట్ ఇవ్వాలని కోరాడు. అయితే ఆమె షర్టు ఇవ్వడానికి నిరాకరించి, దినేష్‌ని ఆ వేడుకకు వెళ్లొద్దని హెచ్చరించింది.

దీంతో దినేష్ మారాం చేయడం ప్రారంభించగా.. ఆమె కోపంతో బాలుడ్ని మందలించి 2 దెబ్బలు వేసింది. దాంతో దినేష్ ఒంటికి టవల్ చుట్టుకుని నేరుగా ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. అక్కడ తన సవతి తల్లి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దినేష్ తండ్రిని సవతి తల్లిని స్టేషన్‌కి పిలిపించి పిల్లల పట్ల ప్రేమతో ఉండాలని సూచిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే దినేష్ కూడా తల్లిదండ్రులపై గౌరవంతో మెలగాలని చెప్పారు.