Double Bedroom Township: ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ ప్రారంబించిన సీఎం కేసీఆర్
కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. అంతకుముందు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Double Bedroom Township: కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. అంతకుముందు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒకే చోట 15 వేల ఇళ్లు..(Double Bedroom Township)
సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15వేల, 660 ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. సుమారు లక్ష జనాభా ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎస్+9లో 38 బ్లాక్‌లు, ఎస్+10లో 24 బ్లాక్‌లు, ఎస్+11లో 55 బ్లాక్‌లు.. మొత్తం 117 బ్లాక్‌లుగా నిర్మించింది. ఒక్కో డబుల్ బెడ్‌రూం విస్తీర్ణం 580 ఎస్‌ఎఫ్‌టీ వరకు ఉంటుంది. ప్రతి బ్లాక్‌కు 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్‌లో ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేశారు.
నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌షిప్‌ను నిర్మించింది ప్రభుత్వం. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. 12 అండర్ గ్రౌండ్ వాటర్ సంప్‌లను నిర్మించారు. ఒక్కో సంపు 11 లక్షల లీటర్ల సామర్థ్యం ఉంటుంది. 90 లక్షల లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టింది.
రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద 1000కోట్లతో మేధా గ్రూప్ నిర్మించిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీని తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రారంభించారు. కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం సీఎ కేసీఆర్ కర్మాగారంలో మిషన్లను పరిశీలించారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు వాటి పనితీరును సీఎంకు వివరించారు. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి లభించనున్నది. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.