Last Updated:

Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‎గా నీరబ్ కుమార్ ప్రసాద్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‎గా నీరబ్ కుమార్ ప్రసాద్

 Neerabh Kumar Prasad: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్‌గా ఉన్న కె.ఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్‌ నియామకం జరిగింది. కొత్త సీఎస్‌ నియమాకం జరిగినందున జవహర్‌రెడ్డిని బదిలీ చేశారు. బుధవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును నీరభ్‌ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు.

ఇవి కూడా చదవండి: