Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. ప్రకటించిన పవన్ కల్యాణ్

MLA Quota MLC Candidate Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యేల కోటా అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ కల్యాణ్ సమాచారం అందించారు.
కాగా, గత కొన్ని రోజుల క్రితం ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీకి కేటాయించారు. ఇందులో భాగంగానే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచన మేరకు నాగబాబును చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకునేందుకు భావించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని ఆయనకు కేటాయించారు.
అంతకుముందు, శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత నాగబాబుకు కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం నడిచింది. అయితే తాజాగా, ఆయన పేరును ఎమ్మెల్యే కోటటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.