Last Updated:

Nara Chandrababu Naidu : తెదేపా చీఫ్ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’..

తెదేపా అధినేత చంద్రబాబు సకిలో డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలోనే తెదేపా నేతలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇప్పటికే పలు రీతుల్లో నిరసన వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్ళు

Nara Chandrababu Naidu : తెదేపా చీఫ్ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’..

Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబు సకిలో డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలోనే తెదేపా నేతలు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇప్పటికే పలు రీతుల్లో నిరసన వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌ల వద్ద ‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 10.30 – 11.30 గంటల మధ్య మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకూ నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించి నిరసన తెలిపారు. దీంతో మెట్రో స్టేషన్‌ల వద్దకు తెదేపా నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడం హాట్ టాపిక్ గా మారింది. ‘వీ వాంట్‌ జస్టిస్‌’ అంటూ వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో మియాపూర్ మెట్రో స్టేషన్‌ను సిబ్బంది కాసేపు తాత్కాలికంగా మూసివేసి.. ఆ తర్వాత ప్రయాణికులను అనుమతించారు. ఇక పోలీసులు కూడా మెట్రో ఎంట్రన్స్ వద్ద నల్ల చొక్కాలు ధరించిన వారిని లోనికి అనుమతించకపోవడంతో వారి మధ్య వాగ్వాదం నెలకొంది.