Last Updated:

Revanth Reddy Comments: అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తాను.. టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే.. తాను సీఎం కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి పోటీచేస్తానని అన్నారు. గతంలో తనపై పోటీ చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరానని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తనపై పోటీకి రాలేదు కాబట్టే నేను సిద్ధం అన్నారు.

Revanth Reddy Comments: అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తాను.. టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy Comments: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే.. తాను సీఎం కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి పోటీచేస్తానని అన్నారు. గతంలో తనపై పోటీ చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరానని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తనపై పోటీకి రాలేదు కాబట్టే నేను సిద్ధం అన్నారు.

తెలంగాణలో హంగ్ రాదు..(Revanth Reddy Comments)

తెలంగాణాలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. హంగ్ ప్రభుత్వం ఏర్పాటు కాదని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. డిశంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. వామపక్షాలతో పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నాయని.. పొత్తులు ఫైనల్ అయిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల సమాయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బంధుపై నిఘా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. 2018లో పోలింగ్ రోజు రైతు బంధు పంచారని ఈసారి కూడా అలాగే పంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా ఈ సారి రైతు బంధు నవంబర్ 3వ తేదీకి ముందు కానీ 30 వ తేదీ తరవాత కానీ రైతు బంధు సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమీషన్‌ని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే  ఈసీకి రాసిన లేఖలో రైతు బంధు కింద ఉద్దేశించిన లబ్ధిదారులకు డబ్బును బదిలీ చేయడానికి కాంగ్రెస్ ఏ విధంగానూ వ్యతిరేకించడం లేదని అన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రయోజనం పొందేందుకు ఈ పథకాన్ని ఉపయోగించకుండా అధికార పార్టీని నిరోధించాలని కోరారు.రైతు బంధు కింద డబ్బు పంపిణీ చేసిన సమయం అనుమానం కలిగిస్తోందని ఠాక్రే అన్నారు.మొదటి పంటకు జూన్‌లో మొత్తం పంపిణీ చేయగా, రెండో పంటకు సంబంధించి రైతుల ఖాతాలకు సబ్సిడీ సొమ్మును బదిలీ చేయడం ఇంకా జరగలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పంపిణీ చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ అది జరగలేదని థాక్రే అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తోందని కాంగ్రెస్ విశ్వసిస్తోందన్నారు.