Last Updated:

Barelakka: షర్మిలక్క కన్నా.. బర్రెలక్కే బెటరా..బ్రో.. ?

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. అనేక ఆశ్చర్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘటన విషయంలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. ఇక విషయానికొస్తే.. ఆమె ప‌క్క‌న సోద‌రుడు త‌ప్ప మ‌రెవ‌రూ లేరు. ఆమెకు నా అని అనుకునే నాయ‌కుడు కూడా లేరు. పిలిచి టికెట్ ఇచ్చేవారు అంత‌క‌న్నా లేరు.

Barelakka: షర్మిలక్క కన్నా.. బర్రెలక్కే బెటరా..బ్రో.. ?

 Barelakka: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. అనేక ఆశ్చర్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘటన విషయంలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. ఇక విషయానికొస్తే.. ఆమె ప‌క్క‌న సోద‌రుడు త‌ప్ప మ‌రెవ‌రూ లేరు. ఆమెకు నా అని అనుకునే నాయ‌కుడు కూడా లేరు. పిలిచి టికెట్ ఇచ్చేవారు అంత‌క‌న్నా లేరు. అయినా.. ఆమె ధైర్యం చేసింది. తెగువ చూపింది. కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టే నాయ‌కులతో ఢీ అంటే ఢీ అనేందుకు ఆమె రెడీ అయింది.

ఫండ్స్ ఇస్తామంటున్న నెటిజన్లు..( Barelakka)

ప‌ట్టుమ‌ని పాతికేళ్లు కూడా నిండ‌ని బ‌ర్రెల‌క్క‌గా పేరొందిన శిరీష‌ యూట్యూబ‌ర్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ.. ప్రాచుర్యం పొందారు. నాగ‌ర్ క‌ర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె నామినేష‌న్ వేశారు.దీనితో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెర‌మీదికి వ‌చ్చిన ఈ చిత్ర‌మైన ఘ‌ట్టంతో ..నెటిజ‌న్ల మెప్పు పొందినట్లు తెలుస్తోంది. ఇక ఇదే స‌మ‌యంలో తెలంగాణ కోడ‌లిన‌ని, తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తాన‌ని డంబాలు చెప్పుకొన్న‌, గొప్ప‌లు పోయిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల‌ను నెటిజ‌న్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ష‌ర్మిల‌క్క క‌న్నా.. ఈ బ‌ర్రెల‌క్క బెట‌ర్ బ్రో !“ అంటూ యువ‌త ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె కు తాము మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇంకొంద‌రు నీ ఫోన్ పే నెంబర్ చెప్ప‌క్కా.. ప్ర‌చారానికి నిధులు ఇస్తామ‌ని చెబుతున్నారు. మ‌రికొంద‌రు.. ష‌ర్మిల క‌న్నా.. నువ్వే బెటర్ .. పార్టీ పెట్ట‌క్కా.. మేం నీతో క‌లిసి న‌డుస్తామ‌ని అంటున్నారు. మొత్తానికి బ‌ర్రెల‌క్క ఓడిపోయినా.. ప్ర‌జాభిమానం మాత్రం ఆమె సొంతం చేసుకోవ‌డం ఖాయమైనట్లుగా భావిస్తున్నారు.

ఇకపోతే.. బర్రెలక్క.. శిరీష ఈ మ‌హా ఎన్నిక‌ల స‌మ‌రంలో చేతులు ఎత్తేయొచ్చు. ఘోరంగా ఓడిపోనూ వ‌చ్చు.మహాఅయితే డిపాజిట్లు ద‌క్కించుకునేంత ఓట్లు కూడా రాక‌పోవ‌నూ వ‌చ్చు. కానీ, ఆమె సాహ‌సం.. స‌మాజానికి ఏదైనా చేయాల‌నే త‌లంపు అంద‌రినీ ఆశ్చర్యానికి గురి చేస్తునట్లు కనిపిస్తోందని రాజకీయ నిపుణులంటున్నారు. “రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య ప‌ట్టిపీడిస్తోందని . దీనికి ఏదైనా చేయాల‌ని అనిపించిందంటూ.. ఎమ్మెల్యే అయితేనే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌గ‌ల‌నని. అందుకే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నా“ అని బర్రెలక్కగా పేరొందిన -శిరీష వెల్ల‌డించారు. దీంతో ఆమె ఇప్పుడు అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.