YS Sharmila: ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. ప్రయాణీకులతో ముచ్చట్లు.. రాష్ట్ర పర్యటన ప్రారంభించిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు తన రాష్ట్ర పర్యటనను మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా శ్రీకాకుళం చేరుకున్న ఆమె ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి బస్సులో ప్రయాణించారు.

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు తన రాష్ట్ర పర్యటనను మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా శ్రీకాకుళం చేరుకున్న ఆమె ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి బస్సులో ప్రయాణించారు.
అభివృద్దిని చూపించండి..(YS Sharmila)
తన ప్రయాణంలో భాగంగా షర్మిల మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యకిగత అంశాలపై కూడా ముచ్చటించారు. ఈ సందర్బంగా బస్పులో మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తాను జగన్ రెడ్డి అనడం నచ్చలేదన్న వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. అందుకే ఇప్పటినుంచి జగన్ అన్నగారు అంటానని పేర్కొన్నారు. మీరు చేసిన అభివృద్ధి చూపించండి.. మీ అభివృద్ధి చూడటానికి తాను సిద్ధమని ఆమె అన్నారు. డేట్, టైం మీరు చెప్పండి.. లేకపోతే తనని చెప్పమన్నా చెప్తానని ఆమె అన్నారు. తనతో పాటు మీడియా, ప్రతిపక్షాలు కూడా వస్తాయని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్సార్ బిడ్డ ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు ఎక్కి తమతో ముచ్చటించే సరికి ప్రయాణీకులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేసారు.
ఇవి కూడా చదవండి:
- Megastar Chiranjeevi Comments: ఎన్టీఆర్ మాటలు విని భూములు కొన్నాను.. మెగాస్టార్ చిరంజీవి
- Prime Minister Narendra Modi: ప్రధాని మోదీకి గజరాజు ఆశీర్వాదం