iPhone 13 Discount: ఊహకు అందనంత డిస్కౌంట్.. రూ.17 వేలకే ఐఫోన్ 13.. వెంటనే కొనుక్కోండి..!

iPhone 13 Discount: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఐఫోన్‌లే. దాని ప్రీమియం డిజైన్, స్ట్రాంగ్ ప్రైవసీ, సేఫ్టీ ఫీచర్ల కారణంగా ఐఫోన్‌లు ప్రత్యేక గుర్తింపుగా మారాయి. నేటికీ ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పోలిస్తే ఐఫోన్లు చాలా ఖరీదైనవి. ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి డిస్కౌంట్ ఆఫర్‌ల కోసం ఎదురుచూడడానికి ఇదే కారణం. అయితే ఇప్పుడు కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌ని కొనాలని చూస్తున్నట్లయితే మీరు మీ ఆలోచనను మార్చుకోవాలి. ఆండ్రాయిడ్ ధరకే ప్రీమియం ఐఫోన్‌ను డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ల ధర లక్షల వరకు ఉన్నప్పటికీ ప్రస్తుతం రూ.17 వేలకే కొనుగోలు చేయచ్చు. బహుశా మీరు దీన్ని నమ్మకపోవచ్చు, కానీ ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ తెలుసుకున్న తర్వాత, మీరు ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచనను వదులుకుంటారు. ఫ్లిప్‌కార్ట్ తన కోట్లాది మంది వినియోగదారుల కోసం ఐఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఐఫోన్‌ను చౌకగా కొనుగోలు చేయచ్చు.
iPhone 13 Offers
ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం అన్ని ఐఫోన్ మోడళ్లపై చాలా ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 15 లేదా ఐఫోన్ 16 సిరీస్‌లను కొనుగోలు చేయడానికి మీకు బడ్జెట్ లేకపోతే మీరు ఫ్లిప్‌కార్ట్ నుండి ఐఫోన్ 13ని చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ ఈ మోడల్ పాతది కావచ్చు. కానీ పనితీరు, కెమెరా, భద్రతా పరంగా ఆండ్రాయిడ్ ఫోన్‌ల కంటే చాలా ముందుంది. ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు ఐఫోన్ 13ని కేవలం రూ.17 వేలకే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఐఫోన్ 13ని కంపెనీ 2021లో లాంచ్ చేసింది. మొబైల్ 128జీబీ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 49,900 ధరతో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ మోడల్‌పై వినియోగదారులకు 9శాతం ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌తో మీరు రూ.4901 ఆదా చేయడం ద్వారా కేవలం రూ.44,999కే కొనుగోలు చేయవచ్చు.
మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే, కంపెనీ మీకు ఈ స్మార్ట్‌ఫోన్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా ఇస్తుంది, తద్వారా మీరు అదనంగా ఆదా చేసుకోగలుగుతారు. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు దానిని EMIలో కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లచ్చు. ఇందుకోసం ప్రతి నెలా రూ.1,583 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
కేవలం రూ.17 వేలకే ఐఫోన్ 13ని కొనుగోలు చేయచ్చు. దీని కోసం, కంపెనీ ఈ వేరియంట్‌పై కస్టమర్లకు బలమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఇస్తోంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే, మీరు రూ.27,500 భారీ మొత్తాన్ని ఆదా చేయచ్చు. పూర్తి ఎక్స్‌ఛేంజ్ వాల్యూ పొందినట్లయితే ఐఫోన్ 13ని కేవలం రూ. 17,499కి కొనుగోలు చేయగలుగుతారు. మీరు బ్యాంక్ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకుంటే, దాని ధర మరింత తగ్గుతుంది. ఎక్స్‌ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
iPhone 13 Specifications
ఐఫోన్ 13ని అల్యూమినియం ఫ్రేమ్‌తో డిజైన్ చేశారు. ఇది IP68 రేటింగ్‌తో వస్తుంది. 6.1 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లే ఉంది. మొబైల్‌లో డాల్బీ విజన్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్ప్లేను రక్షించడానికి సిరామిక్ షీల్డ్ గ్లాస్ ఇందులో అందించారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ అప్‌గ్రేడ్ చేయగల iOS 15పై రన్ అవుతుంది. ఈ ఐఫోన్‌లో గరిష్టంగా 4జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేస్ఉ ఉంది. టోగ్రఫీ కోసం డ్యూయల్ 12+12 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడచ్చు.
ఇవి కూడా చదవండి:
- Limited Time Offer: భారీ డిస్కౌంట్.. రూ.25 వేల రియల్మీ స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకే.. ఇంకా ఆలోచిస్తున్నారా..?