Prime Minister Narendra Modi: ప్రధాని మోదీకి గజరాజు ఆశీర్వాదం
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రధాని మోదీ పర్యటనలో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనవరి 22న అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు తిరుచిరాపల్లి లోని శ్రీ రంగనాథ స్వామి ఆశీర్వాదానికి వచ్చారు. అనంతరం అక్కడే ఉన్న ఆండాళ్ అనే గజరాజుకి ప్రధాని మేత తినిపించారు.

Prime Minister Narendra Modi: తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రధాని మోదీ పర్యటనలో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనవరి 22న అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు తిరుచిరాపల్లి లోని శ్రీ రంగనాథ స్వామి ఆశీర్వాదానికి వచ్చారు. అనంతరం అక్కడే ఉన్న ఆండాళ్ అనే గజరాజుకి ప్రధాని మేత తినిపించారు.
అనంతరం గజరాజు ప్రధానిని ఆశీర్వదించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీకి దేవుడి ఆశీర్వాదం లభించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కంబరామాయణం శ్లోకాలను విన్నారు. అనంతరం రామేశ్వరంలోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.తమిళనాడులోని రామేశ్వరంలోని శ్రీఅరుల్మిగు రామనాథస్వామి ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూజలు చేశారు. అగ్ని తీర్థం అని పిలువబడే సముద్రంలో ప్రధాని పవిత్ర స్నానం చేశారు. రామాయణ ఇతిహాసంలో పవిత్రమైన రామేశ్వరం నగరానికి ప్రాముఖ్యత ఉంది. అగ్ని తీర్థం తరచుగా ఒకరి పాపాలను కడిగే పవిత్ర స్థలంగా సూచిస్తారు. అయోధ్యలో రామమందిర శంకుస్థాపనకు ముందు ప్రధాని పర్యటన వచ్చింది.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభం..( Prime Minister Narendra Modi)
అంతకుముందు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 (KIYG)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 2029 యూత్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్ క్రీడలను నిర్వహించేందుకు మేము శ్రద్ధగా కృషి చేస్తున్నామని అన్నారు.తమిళనాడు ఆతిథ్యం అందరి హృదయాలను గెలుచుకుంటుందని, అథ్లెట్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- DNA Test for Dogs: ఉత్తర ఇటలీ ప్రావిన్స్ లో పెంపుడు కుక్కలకు డీఎన్ఏ పరీక్షలు.. దేనికో తెలుసా?
- Zambia Cholera Outbreak: కలరాతో వణుకుతున్న జాంబియా .. 10,000కు పైగా కేసులు.. 400 మందికి పైగా మృతి