Last Updated:

YS Avinash Reddy: తండ్రి అరెస్టుపై వైఎస్ అవినాష్ రెడ్డి ఏమన్నారంటే..?

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు ఎంపీ

YS Avinash Reddy: తండ్రి అరెస్టుపై వైఎస్ అవినాష్ రెడ్డి ఏమన్నారంటే..?

YS Avinash Reddy: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ని అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున పులి వెందుల చేరుకున్న సీబీఐ అధికారులు భాస్కర రెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం ఆయనను పులివెందుల నుంచి హైదరాబాద్ కు తరలించారు. సీబీఐ అధికారులు వచ్చిన విషయాన్ని తెలుసుకుని అవినాష్‌రెడ్డి అనుచరులు, వైకాపా కార్యకర్తలు భారీ సంఖ్యలో భాస్కర్‌రెడ్డి నివాసం వద్దకు తరలి వచ్చారు. అరెస్ట్‌ అనంతరం భాస్కర్‌రెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారుల వాహనాలను అవినాష్‌ అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు.

 

 సీబీఐ దిగజారడం బాధాకరం(YS Avinash Reddy)

కాగా, తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టుపై ఎంపీ అవినాష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ కేసు విషయంలో సీబీఐ ముఖ్య విషయాలు మరిచిపోతున్నారు. అర్థం పర్థంలేని విషయాలను సీబీఐ పెద్దగా చూపిస్తోందని.. సీబీఐ ఈ స్థాయికి దిగజారడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ‘భాస్కర రెడ్డిని ఊహించని విధంగా అరెస్టు చేశారు. సీబీఐ ఈ స్థాయికి దిగజారడం విచారకరం. అధికారుల తీరుపై సీబీఐ పెద్దలకు తెలియజేశాం. పాత అధికారుల తప్పులనే కొత్త వాళ్లు కొనసాగిస్తున్నారు. మేం లేవనెత్తిన అంశాలను సీబీఐ పట్టించుకోవడంలేదు. వివికే హత్య గురించి ముందుగా తెలిసింది ఆయన అల్లుడికే.. పోలీసులకు నేనే స్వయంగా సమచారం అందించాను.

నాకంటే ముందే వివేకా హత్య గురించి తెలిసినా.. ఆయన పోలీసులకు చెప్పలేదు. సమాచారాన్ని దాచిపెట్టినందుకు వివేకా అల్లుడిని ఎందుకు విచారించడం లేదు. వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలి కానీ వ్యక్తుల టార్గెట్ గా కాదు. మమ్మల్ని దోషులుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. దస్తగిరి వాంగ్మూలాన్ని, వాచ్ మెన్ రంగన్న చెప్పిన విషయాలను కూడా సీబీఐ పట్టించుకోలేదు. విచారణను సీబీఐ అధికారులు, సునీత ప్రత్యేక కోణంలో తీసుకెళ్తున్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధం. మా నిర్దోషిత్వం నిరూపించుకుంటాం’ అని అవినాష్ రెడ్డి తెలిపారు.

 

మరో వైపు వివేకా హత్య కేసులో రెండు రోజుల క్రితం ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్యకు ముందు భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉదయ్‌ ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా సీబీఐ గుర్తించింది. ఉదయ్ కుమార్ ను గత శుక్రవారమే కడపలో అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు హైదరాబాద్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు జడ్జి. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు.