Last Updated:

Telugu Desam Party : ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తెదేపా ఎమ్మెల్యేలు.. స్పీకర్ పై ఫైర్ అయిన అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ నెల 21న సమావేశాలు ప్రారంభమవ్వగా..  27వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. దాంతో టీడీపీ  వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి మారి మాటల యుద్ధానికి నేతలు సై అంటున్నారు.

Telugu Desam Party : ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తెదేపా ఎమ్మెల్యేలు.. స్పీకర్ పై ఫైర్ అయిన అచ్చెన్నాయుడు

Telugu Desam Party : ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ నెల 21న సమావేశాలు ప్రారంభమవ్వగా..  27వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. దాంతో టీడీపీ  వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి మారి మాటల యుద్ధానికి నేతలు సై అంటున్నారు. దాంతో అసెంబ్లీ నుంచి ఐదుగురు తెదేపా ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలానే నిన్న 14 మంది ఎమ్మెల్యేలను ఒక్క రోజుకు సస్పెండ్ చేశారు. ఇవాళ మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఒక్క రోజుకు సస్పెండ్ చేశారు. కాగా ఈ చర్యల పట్ల టీడీపీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించింది. నిన్న జరిగిన సమావేశాల్లో బాలకృష్ణ మీసం తిప్పడం.. అంబటి రాంబాబు దమ్ముంటే రా అని అనడం.. మరో వైసీపీ ఎమ్మెల్యే తొడ గొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక నేడు కూడా బాలయ్య విజిల్ వేస్తూ నిరసన తెలపడం పెద్ద చర్చగా మారింది. గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీని బహిష్కరించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్పీకర్ తమ్మినేని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరించారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను యూజ్ లెస్ ఫెలోస్ అని తిట్టినపుడే ఆయనపై గౌరవం పోయిందన్నారు. మమ్మల్ని తిడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలను మన సభ్యులంటూ గౌరవంగా సంభోధించారని చెప్పారు. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పక్కన పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబుపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ముఖ్యమంత్రి జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ తాము తీర్మానం ఇచ్చామన్నారు.