Last Updated:

Road Accident : ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి,, మరో ఇద్దరికీ తీవ్రగాయలు

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు - కారు ఢీ కొనగా ఏఈ విషాద ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తుంది. అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్‌ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం అందుతుంది.

Road Accident : ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి,, మరో ఇద్దరికీ తీవ్రగాయలు

Road Accident : ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు – కారు ఢీ కొనగా ఏఈ విషాద ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తుంది. అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్‌ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం అందుతుంది. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని హైవేపై ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి.

ఈ  ఘటనలో కారులో ప్రయాణిస్తున్న విజయ­వాడకు చెందిన సాయి (26), పిల్లి శ్రీనివా­స్‌ (23), చంద్రశేఖర్‌ (25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయ­పడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హైవే అంబులెన్స్, 108లో వినుకొండకు తరలించారు. ఈ క్రమంలోనే మార్గం మధ్యలో శంకర్ (24) కూడా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి హిందూపురం వెళ్తుండా.. కారు వినుకొండ వైపు వెళుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతల కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.