Posters In AP : ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం.. విజయవాడలో అలా,,, వైజాగ్ లో ఇలా !

Posters In AP : ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు రావడం కలకలం రేపుతుంది. ఒక వైపు విజయవాడలో కార్మికులను రోడ్డున పడేసిన చరిత్ర వైసీపీదే అంటూ పోస్టర్లు వేశారు. మరోవైపు రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం-సుస్వాగతం అంటూ విశాఖలో ఏర్పాటుచేసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 3న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందంటూ జన జాగరణ సమితి వినూత్నంగా నిరసన తెలిపేందుకు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. వైసిపి ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇంటికి సీఎం జగన్ వెళ్ళే అవకాశాలుండటంతో ఆ దారిలో రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు స్వాగతం అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఇలా విశాఖలో జన జాగరణ సమితి, విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తులు సీఎం జగన్ పై సెటైర్లు విసురుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలు దుమారం రేపుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- Harirama Jogaiah Analysis: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల పొత్తులపై హరిరామ జోగయ్య విశ్లేషణ ఏమిటంటే..