Home / ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దిక్కులేకుండా మారిందని దీనిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ముఖ్యనేతలతో సమావేశమయి వారికి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కులం, మతాన్ని దాటి వచ్చానని మానవత్వాన్ని నమ్మానని అన్నారు.
కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా గతంలో పాలకులు చేయనివిధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ -200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీఎం జగన్ ప్రారంభించారు.
పుంగనూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు కనిపించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆరోపించారు. పుంగనూరు మంత్రి పెద్ది రెడ్డి జాగీరా అంటూ ఆయన ప్రశ్నించారు.
: వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. రిటైల్ స్టోర్ మూసేసే ముందు క్లియరెన్స్ సేల్ చేసినట్టు.. ప్రభుత్వ భూములను సీఎం జగన్ క్లియరెన్స్ సేల్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.మంగళగిరి కేంద్రకార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ నెల 16నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 16వ తేదీ ఉదయం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సూచనల మేరకు సోమవారం 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను మార్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.కొత్తగా నియమితులైన ఇన్ఛార్జ్లు మంగళవారం నుంచి పార్టీ కార్యకలాపాలు చూసుకుంటారని తెలిపారు.
విశాఖ పట్నంలోని నొవాటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ సత్యనారాయణ ఎంవీబీ వెంచర్ సంబంధించిన రోడ్డును బ్లాక్ చేశారని.. నిరసన వ్యక్తం చేసేందుకు బయలుదేరిన జనసేన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలను పోలీసులు అడ్డుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) పార్టీకి తన పదవికి రాజీనామా చేశారు. స్సీకరి్ తమ్మినేని సీతారాంకి తన రాజీనామా లేఖని పంపించారు. కొంతకాలంగా పార్టీ అధిష్టానం పట్ల ఆళ్ళ రామకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీనితో స్పీకర్ ఫార్మాట్లొ రాజీనామా లేఖని ఆళ్ళ రామకృష్ణారెడ్డి సమర్పించారు.
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు వరద తాకిడికి రెండో గేటు కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టునుంచి నీరు వృథాగా పోతోంది.యుద్ధ ప్రాతిపదికన ఇంజనీరింగ్ అధికారులు స్టాప్ లాక్స్ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. నీరు ఆగకపోవడంతో... మూడు గేట్లుఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం, బాలిరెడ్డి పల్లి లో వరద బాధితులతో జగన్ మాట్లాడారు.ప్రభుత్వం అందించే రేషన్ వివరాలు వెల్లడిస్తూ కేజీ ఆనియన్, కేజీ ఉల్లిగడ్డ అని జగన్ వ్యాఖ్యానించారు.