YSRCP: 11 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన వైఎస్సార్‌సీపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచనల మేరకు సోమవారం 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను మార్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జ్‌లు మంగళవారం నుంచి పార్టీ కార్యకలాపాలు చూసుకుంటారని తెలిపారు.

YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచనల మేరకు సోమవారం 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను మార్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జ్‌లు మంగళవారం నుంచి పార్టీ కార్యకలాపాలు చూసుకుంటారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసేందుకు వీరు కృషి చేస్తారన్నారు.వైఎస్ జగన్ నిర్దేశించిన ‘వై నాట్ 175’ లక్ష్యాన్ని సాధించడం కోసం ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
11 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు ..( YSRCP)
గుంటూరు పశ్చిమ విడదల రజిని
మంగళగిరి గంజి చిరంజీవి
పత్తిపాడు బి.కిషోర్ కుమార్,
కొండేపి ఆదిమూలపు సురేశ్
వేమూరు అశోక్ బాబు,
తాటికొండ మేకతోటి సుచరిత
సంతనూతలపాడు మేరుగు నాగార్జున
చిలకలూరిపేట రాజేష్ నాయుడు
రేపల్లె ఈవూరు గణేశ్,
అద్దంకి పాణెం హనిమిరెడ్డి
గాజువాక శ్రీ వరికూటి రామచంద్రరావు
ఇవి కూడా చదవండి:
- MLA Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా
- Article 370: ఆర్టికల్ 370 రద్దును సమర్దించిన సుప్రీంకోర్టు.