Home / ఆంధ్రప్రదేశ్
నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం తమకు రావాల్సిన వాటా నీటినే తీసుకున్నామని వివరించారు. తమవి కాని ఒక్క నీటి బొట్టునైనా తీసుకునే ప్రసక్తే లేదన్నారు. సాగర్ లో 13వ గేట్ వరకూ ఏపీకి చెందిన భూభాగమని.. మా ప్రాంతాన్ని మేము తీసుకున్నామని తెలిపారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును సీబీఐకి ఇవ్వాలన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్పై విచారణ డిసెంబర్ 13కి వాయిదా పడింది. ఈ కేసులో కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్ తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు.
ఏపీలో క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు వద్ద పచ్చ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. జాతీయ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్కెఎఫ్డిసి) సహకారంతో స్వచ్ఛత ఉద్యమి యోజన (ఎస్యువై) కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎంపిక చేసిన 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు (సఫాయి కర్మచారిలు) ముఖ్యమంత్రి లాంఛనంగా వాహనాలను అందజేశారు.
ఏపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురైన మంత్రి వాంతులు చేసుకున్నారు. ఇక వైద్యులు గుండె సంబంధిత పరీక్షలతో పాటు పూర్తి హెల్త్ చెకప్ చేయాలని సూచించారు. రేపు ఉదయం మంత్రి వేణుకి డాక్టర్లు వైద్య పరీక్షలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం చేశారు. దాదాపు రూ.3099 కోట్లు సబ్స్టేషన్ల కోసం ఖర్చుచేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్పురం,
తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దుపై ఏపీ సీఐడి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను.. సుప్రీం కోర్టు డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. అలానే తాజాగా ఈ కేసుకు సంబంధించి మాట్లాడవద్దని
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. గతవారం ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాదనలు విననుంది
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి చంద్రబాబు హయాంలో కంటే 13.2 లక్షల కోట్లకు పెరిగిందని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో 15వ స్థానంలో ఉన్న రాష్ట్రం దేశంలోనే పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 5వ స్థానంలో ఉందన్నారు. ఇవన్నీ పచ్చ కళ్లద్దాల వల్ల పురంధేశ్వరికి కనిపించడంలేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓటర్లు తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న విషయం వాస్తవమే. ముఖ్యంగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాలే కాదు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సీమాంధ్ర రాజకీయాల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ క్రమంలో ప్రముఖ
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరాయినట్లు తెలుస్తుంది. అనంతరం కైకలూరు సబ్