Home / ఆంధ్రప్రదేశ్
ఏపీలో అధికార వైసీపీ పార్టీకీ మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. త్వరలో జనసేనలో చేరుతున్నానని బాలశౌరి ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనకి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలశౌరి మనస్తాపంతో ఉన్నారు.
రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన భేటీ వివరాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. జనసేన బలంగా ఉన్న చోట్ల కనీసం 40 స్థానాలకి తగ్గకుండా చూడాలని పవన్ కళ్యాణ్‌ని కోరానని జోగయ్య వెల్లడించారు.
తిరుపతిలో మాజీ ఎంపీ చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ తరపున తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్‌కు 130 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు సీట్లు వస్తాయని ఆయన అన్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ నేత షర్మిల కలిశారు. ఈ నెల 18న తన కుమారుడు రాజారెడ్డి- అట్లూరి ప్రియ ఎంగేజ్మెంట్కి, ఫిబ్రవరి 17న జరుగబోయే ఎంగేజ్మెంట్కి రావాలని చంద్రబాబు నాయుడిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. చంద్రబాబు షర్మిలను సాదరంగా ఆహ్వానించారు. తప్పకుండా వివాహానికి హాజరవుతానని చెప్పారు.
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అస్సాంవాసులు తిరుమలలోని మోకాళ్ళ పర్వతంపై డ్రోన్‌తో వీడియో తీశారు. మోకాళ్ళ పర్వత ప్రాంతం, ఘాట్ రోడ్డులను అస్సాం వాసులు షూట్ చేశారు.అస్సాంకు చెందిన దంపతులిద్దరూ కారులో మోకాళ్ళ పర్వతంపైకి వచ్చి డ్రోన్‌ను వినియోగించారు.
కరీంనగర్లో ఓ కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. నాలుగు రోజులుగా కరీంనగర్ రెండో డిపోలో బందీగా ఉన్న కోడిపుంజును ఆర్టీసీ అధికారులు వేలం వేయనున్నారు. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఎవరో కోడిపుంజును మర్చిపోయారు. దీనితో దీనిని వేలం వేయాలని నిర్ణయించారు.
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా మూడో జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఆరు పార్లమెంట్ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది. తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను వెల్లడించారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో సీనియర్ నేత మాజీ హోమ్ శాఖ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామజోగయ్య సమావేశమయ్యారు. వర్తమాన రాజకీయ అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని శ్రీ హరిరామజోగయ్య అభిలషించారు.
కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. షర్మిలకు పీసీసీ చీఫ్ ఇస్తే బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని.. కావాలంటే జాతీయ స్థాయిలో పదవి ఇచ్చుకోండని ఆయన సూచించారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్న షర్మిల ఏపీలో ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు.
పొలిటికల్ రీ ఎంట్రీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడీ అయిపోయారు. ముద్రగడతోపాటుగా ఆయన కుమారుడు కూడా పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా తండ్రీ కొడుకులు మొదలు పెట్టేశారు. నిన్న జనసేన నేతలు, ఇవాళ టిడిపి నేతలు ముద్రగడని కలవడంతో ఉభయగోదావరి జిల్లాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది.