Home / ఆంధ్రప్రదేశ్
విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 81 అడుగుల పీఠంపై 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం తయారీకి 400 మెట్రిక్ టన్నుల స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో ఉదయం ఆయన కలిశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మెుదటిసారి పవన్‌తో భేటీ అయ్యారు. జనసేనలో చేరిక ముహూర్తం, ఇతర అంశాలపై పవన్‌తో చర్చించారు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ విడుదల చేశారు.బుధవారం జనసేన పార్టీ 50 నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనేది ఆయన తన లేఖ ద్వారా తెలియేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను హరిరామ జోగయ్య విడుదల చేశారు.
నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలలో బాలకృష్ణ ఫోటో లేదని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోటో లేని ప్లెక్సీలను తొలగించాలని తోటి నాయకులను ఆదేశించారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయపరిస్థితులపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తో ఆయన చర్చలు జరిపారు. కొణతాల త్వరలోనే మంచిరో్జు చూసుకుని జనసేన పార్టీలో చేరనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో విజయవాడ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నాయకులు పార్టీలు మారుతున్నారు. తాజాగా అధికార వైసీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖలో జనసేన గెలిచే నియోజకవర్గాలు, అక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుందో సూచించారు. తిరుపతి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని తెలిపారు.
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. దామోదర రాజనరసింహ ఫేస్ బుక్ లో కొంతమందిబీజేపీ, టీడీపీ, తమిళనాడు లోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులు పెట్టారు. కొందరు నాయకులు దామోదరకు కాల్ చేసి విషయాన్ని చెప్పారు.
ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి ఉండవల్లిలోని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతోపాటు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సోమవారం టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాని విడుదల చేసే అవకాశాలున్నాయి.