Home / ఆంధ్రప్రదేశ్
జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. ఒక పక్క పార్టీలో పెరుగుతున్న చేరికలు, మరోవైపు గాజు గ్లాసు గుర్తు ఖరారు చేయడం శుభ సంకేతాలని పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
మంగళగికి జనసేన పార్టీ కార్యాలయానికి బుధవారం పలువరు నేతలు క్యూ కట్టారు. పవన్ కళ్యాణ్ తో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సమావేశమయ్యారు. జనసేన పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మంచిరోజు చూసుకుని పార్టీలో చేరుతారని సమాచారం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కలిశారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని తాజాగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందింది. గంటా రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చాలా కాలం క్రితమే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల ముందు గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలపడం హాట్ టాపిక్‌గా మారింది.
సీఎం జగన్ మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 6,394 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ ఆసరా పథకంతో 79 లక్షల మంది మహిళలు లబ్ది పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు తన రాష్ట్ర పర్యటనను మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా శ్రీకాకుళం చేరుకున్న ఆమె ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి బస్సులో ప్రయాణించారు.
వైసీపీకి, ఎంపీ పదవికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు నేడు వైసీపీకి రాజీనిమా చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా వల్ల అనిశ్చితి రాలేదు.. ఇందుకు తాను బాధ్యుడుని కాదని ఆయన అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్దికి, జనసేన పార్టీకి చాలా కీలకమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ నేపధ్యంలో ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాస్ఠ్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపుకు అండగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో 42 రోజులనుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్య బద్దంగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. నామమాత్రపు వేతనాలతో సేవలందిస్తున్న మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధులనుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగడం పాలకుల ధోరణిని తెలియజేస్తోందన్నారు.
విశాఖలో లోక్‌నాయక్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, జస్టిస్ ఎ.వి.శేషసాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్, హరివంశరాయ్‌బచ్చన్ వర్థంతి సందర్భంగా పురస్కారాల ప్రదానం చేశారు. ఈ ఏడాది యండమూరి వీరేంద్రనాథ్‌కు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ఇచ్చారు.