Home / ఆంధ్రప్రదేశ్
గాజు గ్లాసు సింబల్‌పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించింది….. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జనసేన. ఆ పిటిషన్ పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.. అయితే, నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్.. ఈ రోజు కీలక విషయాలను వెల్లడించింది..
మూడు హామీలు తప్ప తమ మేనిఫెస్టోలోని అన్ని విషయాలు అమలు జరిపామని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా, సంపూర్ణ మద్య నిషేధం, సిపిఎస్ రద్దు… ఈ మూడు హామీలు తప్ప 99 శాతం హామీలు అమలుచేశామని ఆయన తెలిపారు.
ఏపీ సీఎం జగన్ కు చెల్లెలు వైఎస్ షర్మిల తాజాగా లేఖాస్త్రం సంధించారు . ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న 'నవ సందేహాలు'కు సమాధానం చెప్పాలని ఆమె లేఖలో డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంవత్సరాల తరబడి అందుతున్న పధకాలను ఎందుకు నిలిపివేసారని ఆమె ప్రశ్నించారు.
ఒకడి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం మనకి లేదు .మన భూమి మీద జగన్ బొమ్మ ఎందుకంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేట లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని పవన్ ప్రసంగించారు .మేము అధికారంలోకి కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డు లు ఇస్తామని చెప్పారు .
మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు పై సినీ నటుడు ,వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరో సారి విరుచుకు పడ్డారు .చంద్రబాబు పబ్లిక్‌గా ఏపీ సీఎం జగన్‌ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ ,కాపు ,బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య తాజాగా మరో బహిరంగ లేఖ రాశారు.వైసీపీ కానీ , తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కానీ తమ ఎన్నికలు మేనిఫెస్టోలలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన 5 శాతం విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కలుగచేసే అంశం లేకపోవటం దురదృష్టకరమని అన్నారు .
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, సిద్ధార్థ్‌నాథ్‌సింగ్ కలిసి మేనిఫెస్టో విడుదల చేశారు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని.. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 15వందల అందిస్తామని చెప్పారు. 18 నుంచి 59 వయస్సు మహిళలకు ఆడబిడ్డ నిధి వర్తిస్తుందన్నారు.
విజయవాడ గురునానక్ నగర్ లో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కలకలం రేపింది. వీరిలో డాక్టర్ డి.శ్రీనివాస్ (40) ఇంటి బయట ఉరేసుకోగా, ఇంటి లోపల శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65), భార్య ఉష (38), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్ (8) విగత జీవుల్లా కనిపించారు. ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు అధికారం అనే ఆకలితో అలమటిస్తున్నారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. 1978లో. చంద్రబాబు ఇంటి పెంకులు కూడా వేయించుకునే స్థితిలో లేరు. ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు అయిపోయారు. ఈ సంపాదన ఎలా సాధ్యపడింది..?మాకు కూడా చెప్తే రాజకీయాలు వదిలేసి మేము కూడా సంపాదించుకుంటామని ముద్రగడ అన్నారు.
చిత్తూరు జిల్లాలో మరోసారి వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అధికార పార్టీ అండదండలతో ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థి అయిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌పై దాడికి తెగబడ్డారు. ప్రచార రథానికి నిప్పు పెట్టారు. సదుం పోలీస్ స్టేషన్ ముందే బీసీవై పార్టీ ప్రచార వాహనాన్ని వైసీపీ శ్రేణులు తగలబెట్టారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు.