Home / ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని ప్రధాని మోదీ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీని వెనక్కు వెళ్లేలా చేసిందని.. గతంలో చంద్రబాబు ఏపీని అభివృద్ధి పథంలో నడిపించారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కూటమి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు.
సైకో జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దని, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ నాశనమైందని అన్నారు.
గుడివాడలో రోడ్లంతా గోతుల మయం.. స్థానిక ఎమ్మెల్యే నోరు బూతుల మయమని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గుడివాడలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి భూములను లాక్కోవడానికి కొత్త పథకం వేసిందని విమర్శించారు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ధ్వజమెత్తారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జగన్‌కు మరో లేఖ రాశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్య నిషేధం ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. పాక్షికంగా అయినా మద్యపాన నిషేధం జరిగిందా అని ప్రశ్నించారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్.. దానిని అమలు చేశాకే ఓట్లు అడుగుతామన్నారని గుర్తు చేశారు.
ఇసుక, మద్యం, గనుల మాఫియా డబ్బంతా సీఎం జగన్‌కే వెళ్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రకాశం జిల్లా పొదిలి చిన్నబజార్ కూడలిలో ప్రజాగళం సభలో సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నల్లమల అడవిలోనే ఎర్రచందనం మాయమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఉద్యోగులపై 15వందల కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు.
:వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు వారాహి విజయ భేరి సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు పవన్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని.. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని పవన్ చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం దాల్చుతున్నాడు. నిన్న ఏపీలో అత్యధికంగా 47 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లాలోని ఎండ్రపల్లిలో రికార్డ్ స్థాయిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మార్కాపురంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఆయన కుమార్తె క్రాంతి షాకిచ్చారు. ముద్రగడను వ్యతిరేకిస్తూ.. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు. తన తండ్రి వైఖరిని తాను వ్యతిరేకిస్తున్నానని, పిఠాపురంలో జనసేన గెలుపుకు పాటు పడతానని చెప్పారు.
జగన్ సిద్ధం అంటూ ఎందుకొస్తున్నాడు? మద్యం ధరలు పెంచినందుకా? ఎందరో మహిళలు కనిపించకుండా పోయారు అందుకా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్ ప్రసంగించారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ కు నవసందేహాలు పేరుతో మరో లేఖ రాసారు. ఈ లేఖలో రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాను అడుగుతున్న సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.షర్మిల రాసిన లేఖలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి.