Home / ఆంధ్రప్రదేశ్
సీబీఐ మాజీ జేడీ ,జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మినారాయణ తన ప్రాణానికి ప్రమాదం ఉందని విశాఖ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. తాజా ఎన్నికల్లో జేడీ లక్ష్మినారాయణ జై భారత్ నేషనల్ పార్టీ తరుపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.జేడీ లక్ష్మినారాయణ అసలు పేరు వాసగిరి వెంకట లక్ష్మినారాయణ కానీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా వున్నప్పుడు జగన్ ను ,గాలి జనార్దన్ రెడ్డి లను అరెస్ట్ చేయడం తో తన హోదా తో జేడీ లక్ష్మినారాయణ అనే పేరు బాగా పాపులర్ అయింది.
విశాఖ రైల్వే జోన్ వ్యవహారం మరో సారి తెరపైకి వచ్చింది .విభజన హామీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనీ కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే .అయితే ఇప్పటి వరుకు దీనిపైనా ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు .ఈ క్రమం లో ఇటు కేంద్రం అటు రాష్ట్రం ఒకరు పై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి.
ఎన్నికల వేళ గుంటూరు జిల్లా వైసీపీ కి షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన ఆ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను సీఎం జగన్‌కు పంపారు.
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కు పెద్ద షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. యనమల రామకృష్ణుడు సోదరుడు ,టీడీపీ నేత యనమల కృష్ణుడు.. టీడీపీకి రాజనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తుని టికెట్ విషయంలో సోదరులిద్దరికి విభేదాలు పొడచుపాయి. తునిలో యనమల రామకృష్ణుడు ఆరుసార్లు గెలవడానికి సోదరుడు కృష్ణుడే కీలక పాత్ర పోషించాడని స్థానికులు చెబుతున్నారు .
ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. .ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎం ల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చిచూడాలని చాలా కాలం నుంచి డిమాండ్ వస్తోంది .ఈ క్రమంలో దీని పై సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ లు వేశారు
సొంత చిన్నమ్మ లెటర్ రాస్తే కూడా పట్టించుకోని జగన్ నీది గుండెనా .లేక్ బండనా అంటూ అన్న జగన్ పై వైఎస్ షర్మిల విరుచుకు పడింది . గురువారం గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న షర్మిల ఏపీ ,సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టింది .
ఏపీ సీఎం జగన్ పై అయన సోదరి ,వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు .జగన్ తలపై బ్యాండేజి తీ సివేస్తేనే మంచిదని సలహా ఇచ్చారు .గాలి ఆడకుండా ఎక్కువ కాలం ఉంటే గాయం మానదని అన్నారు .అలాగే ఉంచుకుంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని ఒక డాక్టర్ గా చెబుతున్నానని అన్నారు .పులివెందుల లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.
అవినీతి మయమైన వైసీపీ ని పాతాళానికి తొక్కేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు .గురువారం సాయంత్రం రాజం పేట జిల్లా రాజం పేటలో కూటమి ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అంటూ నినాదాలు ఇచ్చారు .మన రాష్ట్రం,మన నేల ,మన ప్రజలు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల కూడదని కూటమి కట్టామని అన్నారు .
ఏపీ సీఎం జగన్ కు తన చిన్నమ్మ ,వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు .ఇప్పటి వరుకు వివేకానంద రెడ్డి హత్య కు సంబంధించి అయన సతీమణి సౌభాగ్యమ్మ ఇప్పటివరకు జగన్‌కు లేఖ రాయడం కానీ ,జగన్ ను విమర్శించడం గాని చేయలేదు . తొలిసారి గా సౌభాగ్యమ్మ లేఖ రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది .
పులివెందుల గడ్డ సాక్షిగా సీఎం జగన్ తన చెల్లెలు షర్మిలపై సెటైర్లు వేసారు. పులివెందుల అసెంబ్లీ స్దానం నుంచి నామినేషన్ వేయడానికి గురువారం వచ్చిన సీఎం జగన్ ఈ సందర్బంగా బహిరంగసభలో తన ప్రత్యర్దులపై మండిపడ్డారు.