Home / ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయమే జనం భారీగా తరలివచ్చారు. అధికార వైసీపీ కార్యకర్తలు దాడులతో భయాందోళన కలిగిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి
షర్మిలకు సొంతగా పార్టీ పెట్టాలన్న ఆలోచన లేదు. కానీ, ప్రశాంత్ కిశోర్.. పదేపదే వచ్చి సలహాలు ఇవ్వడంతో పార్టీ పెట్టారని షర్మిల భర్త బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్య చేసారు .తాజాగా బ్రదర్ అనిల్ కుమార్.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో కూటమి విజయం ఖాయమని ప్రజల ఉత్సాహం చూస్తుంటే అర్థమవుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో రోడ్‌షో నిర్వహించారు.ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ దేశాభివృద్ధికి మోదీ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. కడప లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. బీజేపీ కీ బీ టీం గా చంద్రబాబు, పవన్, జగన్ పనిచేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ప్రత్యేక హోదా పై జగన్ ఏనాడు కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ ను ,గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ని తీవ్రంగా విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని హెచ్చరించారు.
తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సూటిగా సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ,ఏపీ ప్రభుత్వ సలహా దారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలు, పిఠాపురంవాసులకు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను ముద్రగడ కోరారు.కాగా, ముద్రగడ లేఖలో..‘గతంలో గాజు గ్లాసు పగిలి ఆ ముక్కలు హాని కలిస్తాయని అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారు.
సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మా మేనిఫెస్టో ను చూసి ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం అనగా 10 వ తేదీ ఒక్కరోజు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయాలని కోరింది.