Chandrababu Naidu: భూరక్షణచట్టం రైతు మెడకు ఉరితాడు.. చంద్రబాబు నాయుడు
ఇసుక, మద్యం, గనుల మాఫియా డబ్బంతా సీఎం జగన్‌కే వెళ్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రకాశం జిల్లా పొదిలి చిన్నబజార్ కూడలిలో ప్రజాగళం సభలో సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నల్లమల అడవిలోనే ఎర్రచందనం మాయమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఉద్యోగులపై 15వందల కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు.

Chandrababu Naidu:ఇసుక, మద్యం, గనుల మాఫియా డబ్బంతా సీఎం జగన్‌కే వెళ్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రకాశం జిల్లా పొదిలి చిన్నబజార్ కూడలిలో ప్రజాగళం సభలో సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నల్లమల అడవిలోనే ఎర్రచందనం మాయమయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఉద్యోగులపై 15వందల కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. పింఛన్లు ఇంటి వద్ద ఇవ్వకుండా బ్యాంకుల్లో జమ చేశారని.. బ్యాంకుల చుట్టూ తిరిగి పింఛన్లు తీసుకోలేక వృద్దుల ఇబ్బందుల పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
ప్రజల భూముల పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు? (Chandrababu Naidu)
పింఛన్‌దారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు అన్నారు. ప్రజల భూముల పత్రాలపై జగన్ ఫొటో ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. భూమి పత్రాలు.. పట్టాదారు పుస్తకం మీ వద్ద ఉండవని చంద్రబాబు అన్నారు. మీ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తీసుకురావచ్చని చెప్పారు. భూరక్షణ చట్టం వల్ల ప్రజలకు లాభం లేదన్నారు. ఈ చట్టం రైతు మెడకు ఉరితాడుగా మారుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే భూ రక్షణ చట్టం రద్దు ఫైల్‌పై రెండో సంతకం పెడతామని , పొదిలికి ఔటర్ రింగ్ రోడ్డు వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- Brij Bhushan Sharan Singh: బ్రిజ్ భూషణ్ కు పార్లమెంటు ఎన్నికల్లో మొండి చెయ్యి
- Pawan Kalyan Questions: జగన్ సిద్ధం అంటూ ఎందుకొస్తున్నాడు ? .. పవన్ కళ్యాణ్