Home / ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తన సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను చర్చించకుండా విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. బయట మీడియా ముందు డ్రామాలు ఒక్కటే తెదేపాకు తెలుసునని మంత్రి కాకాని ఎద్దేవా చేశారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత శుక్రవారం కోలగట్ల ఒక్కరే నామినేషన్ వేయడంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనం అయ్యింది. కోన రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి కోలగట్లను ఎంపిక చేశారు.
మూడో రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టిడిపి శాసనసభాపక్షం ''ఛలో అసెంబ్లీ'' పేరిట వినూత్న నిరసన చేపట్టింది. వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మందడం నుండి అసెంబ్లీ ప్రాంగణం వరకు ఎడ్లబళ్లపై వెళ్లేందుకు నారా లోకేష్ తో సహా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమ కుటుంబానికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. తమ తండ్రి హయాం నుంచే తాము లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. కుట్రపూరితంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీలో సోమవారం పోలవరం నిర్వాసితుల పరిహరం చెల్లింపు పై ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన చర్చలో టీడీపీ సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది.
హైదరాబాద్ బేగంపేటలో దారుణం జరిగింది. పేస్ బుక్ పరిచయం ఆ మహిళ ప్రాణాలు తీసింది. పెళ్లైందని చెప్పినా వినిపించుకోకుండా ఆ మృగాడు ఆ మహిళకు న్యూడ్ వీడియో కాల్స్ చేసి వేధించేవాడు. ఫోన్ ఎత్తకపోతే చంపేస్తానంటూ బెదిరించేవాడు. అంతటితో ఆగక ఆమె భర్తను వదిలేసి రావాలని హింసించేవాడు. దానికి నిరాకరించిందని ఆ మహిళను నేడు బీర్ బాటిల్‌తో గొంతుకోశాడు.
ఆంధ్రప్రదేశ బార్డర్ సమీపంలో ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని దంతెవాడ- కిరండూల్ సెక్షన్లో వెళ్తోన్న రైలును మావోలు హైజాక్ చేశారు. కేవీఎస్ 11 నంబర్ గూడ్స్ రైలుని మావోయిస్టులు ఆదివారం సాయంత్రం 10 నిమిషాల పాటు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
ఈ సారి ఎన్నికల్లో బలంగా పోరాడగలిగె అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇస్తామని తెలిపారు.అసెంబ్లీలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
అమరావతి రైతుల పార్ట్ 2 పాదయాత్ర నేపధ్యంలో ఏపి మంత్రులు తమ స్వరాన్ని పెంచారు. పాదయాత్ర ఆధ్యంతం మాజీ సీఎం చంద్రబాబు నేపధ్యంలోనే సాగుతుందని పదే పదే చెబుతున్నారు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) ఉగ్రవాద కార్యకలాపాలపై తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాల నేపధ్యంలో రెండు తెలుగు ప్రభుత్వాలపై భాజాపా నేత విష్ణువర్ధన రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు