Home / ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రులు మారిన్నప్పుడల్లా రాజధానిని మారుస్తామనడం కరెక్ట్ కాదని పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి అన్నారు
సాధారణంగా అమ్మాయిలకు కాల్ చేసిమరీ అత్యాశక్తితో మాట్లాడుతుంటారు అబ్బాయిలు. అదే అమ్మాయి నుంచి అర్థరాత్రి వీడియో కాల్ వస్తే.. ఇంక మనోడు ఆగుతాడా కాల్ లిఫ్ట్ చేసి కాసేపుమాట్లాడు. అంతే ఇంక జరగాల్సిందంతా జరిగిపోయింది. సీన్ కట్ చేస్తే కాపాడండి సారూ అంటూ అధికారులను వేడుకుంటున్నాడు. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ హనీట్రాప్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ యాత్రలు వాయిదా పడుతున్నాయి. తెలుగుదేశం కీలక నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో వచ్చే నెలలో ప్రారంభం కావాల్సిన పాద యాత్రను జనవరి నెలకు వాయిదా వేసిన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా నటుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుండి తాను చేపట్టనున్న జనసేన యాత్ర వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిత్యం సోషల్ మీడియాలో నానుతుంది. అధికార పార్టీ పోలీసింగ్ అని, న్యాయం కోసమని ఇలా ఒకటేంటి నిత్యం ఎక్కడో ఒక చోటు పోలీసు అనే పదం లేకుండా సోషల్ మీడియాలో టాపిక్ నడవడం లేదు. తాజాగా ఓ ఎస్సై రాజీనామా లేక సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమై మరోమారు ఏపి పోలీసు పేరు వైరల్ అవుతుంది.
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 18,19,20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు దగ్గర రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు విడిపోయాయి. ఒక్కసారిగా బోగీలు రైలు నుంచి వేరవ్వడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
స్టూడెంట్ పై లెక్చరర్ దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది. విజయవాడ చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ బోర్డ్ ఫైర్ అయ్యింది. చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. నిజామాబాద్, నిర్మల్, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఏపీకి ఎందుకొస్తున్నారని, అంతా ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం కేసీఆర్ ఏపీ పర్యటనకు వచ్చారు. అప్పుడు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.
ఏపీలో మూడు రాజధానుల విషయం ఇపుడు దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. ఇప్పటికే రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు ఇచ్చి అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంది. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని కూడా ఆదేశించింది. అలాగే సీయార్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ఈ తీర్పు వెలువడి కొన్ని నెలలు గడిచాయి... ఇలాంటి తరుణంలో ఏపీ సర్కారు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడం ఉత్కంఠ రేపుతోంది.