Home / ఆంధ్రప్రదేశ్
తెలంగాణ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 75వ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్య చైతన్య దీప్తి తెలంగాణ చైతన్యానికి నెలవు, విప్లవాలకు కొలువు తెలంగాణ. ప్రపంచంలోనే పేరుగాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటి గడ్డ తెలంగాణ.
నేడు ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం జగన్, టిడిపి అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని జగన్ ట్వీట్ చేశారు. ప్రధానికి ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడు పెంచారు. ఈ సారి 175 సీట్లకు 175 గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 2024 లో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రీపెర్ అవుతున్నట్టు తెలుస్తుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని పలుప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి.
ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలకు గ్రామ, వార్డు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఛీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
కృష్ణా జిల్లాలో ఘోరం చోటుచేసుకొనింది. వారి జీవనవృత్తే వారిని యమపాశంలా కబళించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.
మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 3 రాజధానుల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. సీఎం జగన్ ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభించవచ్చని ఆయన తెలిపారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంపై కేసు నమోదు నేపధ్యంలో దేశ వ్యాప్తంగా మరోమారు దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలంగాణ సీఎం కూతురు, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బాగానే ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. అసెంబ్లీలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదన్నారు.