Home / ఆంధ్రప్రదేశ్
కట్టేసి కొట్టిన ఘటనలో తనను వర్చువల్ స్ధానంలో విచారణ జరపాలని పేర్కొన్న కోర్టు ఉత్తర్వులను సైతం ఏపీ సీఐడి అధికారులు ఉల్లంఘిస్తున్నారని పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణం రాజు మీడియాతో పేర్కొన్నారు
మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఇవ్వాలని, వారికి రాజకీయాల్లో 50శాతం కట్టబెట్టేలా చట్టాలు తేవాలనుకొనే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అసభ్య పదజాలంతో విరుచుకుపడే మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా మాటలు రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి
తెలుగు రాష్ట్రాల్లో భారత్ జోడో యాత్రను సమన్వయం చేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం తనకు అప్పగించిందని ఆ పార్టీ సీనియర్, తెలంగాణ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఏపీ అంసెబ్లీ సమావేశాలు నాలుగోరోజు వాడివేడిగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు 3 బిల్లులకు ఆమోదం తెలిపింది. కాగా నేడు ఏడు బిల్లులను ఏపీ సర్కార్ సభలో ప్రవేశపెట్టింది. విద్య, వైద్యం, నాడు-నేడు పై సభలో చర్చ జరుగనుంది. శాసనసభ ముందుకు పెగాసెస్ నివేదిక కూడా నేడు రానుంది.
సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో అవసరమైన గ్యాస్ సిలెండర్ ను రూ. 500లకే అందించే దస్త్రం పైనే కాంగ్రెస్ తొలి సంతకమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు.
తెలుగుదేశం నేతలు ఛలో అసెంబ్లీకి పిలుపు నివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అసెంబ్లీ పరిసరాలలోనూ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోనూ డ్రోనులను తిప్పతూ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీకి దారితీసే అన్ని మార్గాల్లోనూ పోలీసుల పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. అయినా కానీ పట్టువిడువని విక్రమార్కుల్లా తెదేపా నేతలు అసెంబ్లీ సమీపంలోని ఓ భవనంపైకి ఎక్కి నిరసన చేపట్టారు.
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసి శుభవార్త చెప్పింది. సాధారణ చార్జీలతో వారి వారి స్వస్ధలాలకు వెళ్లవచ్చని తీపి కబురు అందించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు ఓకే చేసింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల కమీషన్ కు సర్వోత్తమ న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. సభలో కార్యక్రమాల నిర్వహణకు అడ్డుపడుతున్నారంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సస్పెన్షన్ తీర్మానం ప్రతిపాదించగా, స్పీకర్ వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో తాజాగా మంచు కుటుంబానికి కోర్టులో ఊరట కల్గింది. ఈ మేరకు విచారణను 8వారాలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది.