Pawan Kalyan: 2024 ఎలక్షన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్
ఈ సారి ఎన్నికల్లో బలంగా పోరాడగలిగె అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇస్తామని తెలిపారు.అసెంబ్లీలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకురావలనే దానిపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తుంది.ఎందుకంటే అక్టోబరులో చేపట్టాల్సిన యాత్రను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.ఈ సారి ఎన్నికల్లో బలంగా పోరాడగలిగె అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇస్తామని తెలిపారు.అసెంబ్లీలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.ఈ ఎన్నికల ప్రణాళికలు సిద్దం చేసిన వెంటనే యాత్రను మొదలు పెడతామని ప్రకటించారు.
దోపిడీలు చేసేవారికి రాజ్యం అప్పజెబితే వారు అత్యాచారాలు చేసేవారిని తప్పిస్తూనే ఉంటారని, పక్క ఇంట్లో దోపిడి జరిగిందని ఊరుకుంటే..తరువాత మన ఇంట్లో జరగడానికి ఎంతో సమయం పట్టదని,దీనిపై ప్రజలు దృష్టి పెట్టాలని, కళ్లముందు జరిగే తప్పులను ఆపాలని పవన్ కళ్యాణ్ అన్నారు.2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినంత మాత్రనా పార్టీని వదిలేసి వెళ్ళి పోతానని అనుకున్నారా ? నాకు ఎన్ని అవమానాలు జరిగిన అవన్ని భరిస్తానని, కష్టాల్లో ఉన్న ప్రజల్లో మా పోరాటాన్ని ఆపమని,అలాగే పార్టీని వదిలే సమస్యే లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఎన్నికలు చట్ట ప్రకార ప్రణాళికలతో జరగకపోతే, అధికారులతో గొడవలకైనా సిద్దంగా ఉన్నామని జనసేనాని తెలిపారు.