Last Updated:

Magunta Srinivasulureddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మాకు సంబంధం లేదు.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమ కుటుంబానికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. తమ తండ్రి హయాం నుంచే తాము లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. కుట్రపూరితంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Magunta Srinivasulureddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మాకు సంబంధం లేదు.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

Amaravati: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమ కుటుంబానికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. తమ తండ్రి హయాం నుంచే తాము లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. కుట్రపూరితంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను, తన కుమారుడు ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లో డైరెక్టర్లుగా లేమని చెప్పారు. వ్యాపారం చేసే తమ బంధువులకు మాగుంట అనే పేరు ఉండటం వల్లే తమ పై ఆరోపణలు అని చెప్పారు. ఢిల్లీలో 32 జోన్లు ఉంటే తమ బంధువులు 2 జోన్లలో వ్యాపారం చేశారని తెలిపారు. తమ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసిన ఈడీకి అనుమానాలు నివృత్తి చేసినట్టుగా చెప్పారు.

ప్రజా సేవ కోసమే రాజకీయాల్లో వచ్చినట్టుగా స్పష్టం చేశారు. తాను ఏ వ్యాపారాల్లోనూ భాగస్వామిని కాదని చెప్పారు. తన వ్యక్తిత్వం పై కావాలని దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ పై సీబీఐ కూడా విచారణ జరుపుతోందన్నారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేస్తున్నాయని అన్నారు. లిక్కర్ డాన్, లిక్కర్ మాఫియా అని ఢిల్లీలో మీడియాలో రకరకాల పేర్లు పెట్టారని అన్నారు. తమ బంధువులు చేసే వ్యాపారాలు తమకు నష్టం కలిగించాయని చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి శుక్రవారం ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా 40కి పైగా చోట్ల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నెల్లూరులోని మాగుంట కార్యాలయం, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి: