Home / ఆంధ్రప్రదేశ్
వైసీపీకి 10 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పబోతున్నారు.. జనసేనకి లైన్ లో 60 మంది ఉన్నారని ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ పృధ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వర్మ చేసిన కామెంట్స్ పలువరు రాజకీయ నాయకులు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంత రావు కూడా వర్మ వ్యాఖ్యలను ఖండించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీవి కావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు.
ఈడీ నోటీసుల నేపథ్యంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి శనివారం ఉదయం 10 గంటలకే విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. సాయంత్రం వరకూ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గల వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ థర్మల్ పవర్‌స్టేషన్‌లో లిఫ్ట్ వైరు తెగి కిందకు పడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్ లో 8 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయి. లిఫ్ట్ లో చిక్కుకున్న వారిని అతి కష్టం మీద బయటికి తీసి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా జరుగుతుంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో ఈ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ మేరకు తాజాగా వచ్చిన ఫలితాలు వైకాపాకి ఊహించని షాక్ ఇచ్చాయి. పట్టభద్రులు అధికార పార్టీకి అనుకోని రీతిలో ఓటమిని కట్టబెట్టారు.
Rains: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉండనున్నాయి. రెండు రోజుల క్రితం ఇరు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలతో పాటు.. వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ పేర్కొంది.
ఏపీలోని కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. జరిమానా కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దాదాపు తెలిసిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఈ ఎన్నికల్లో రుజువైందని గంటా విశ్లేషించారు. రాజధాని వ్యవహారం సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల్లో విశ్వాసం లభించలేదన్నారు. మూడేళ్ల క్రితం దాదాపు 50 ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందన్నారు.
ఏపీలో పట్టభద్రులు (గ్రాడ్యుయేట్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మార్చి 15న రీపోలింగ్ నిర్వహించారు.