Home / ఆంధ్రప్రదేశ్
భారతదేశంలోని అతిపెద్ద టాయ్-ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ అయిన ప్లాట్‌ఫామ్ 65.. భారతీయ రైల్వే ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు రైల్వే ఉద్యోగులకు ప్రత్యేకంగా 18% ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. రైల్వే నెట్వర్క్ కు.. వారి అమూల్యమైన సహకారానికి ప్రశంసా చిహ్నంగా, ప్లాట్‌ఫాం 65 ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ను జగన్ అనే జలగ పట్టి పీడిస్తోందని జనసేన అధినేతన పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన తణుకు నియోజకవర్గం నాయకులు, వీర మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ అవినీతి, అరాచకాన్ని జగన్ తారాస్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఒక కులం పార్టీని, సమాజాన్ని నడపలేదని దోచుకునే వాళ్లకే కాదు అందిరికీ హక్కులున్నాయని అన్నారు.
తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని విద్యావ్యవస్థను తెలంగాణతో పోల్చడం సరికాదని, రోజూ అనేక కథనాలు, కుంభకోణాలు కనిపిస్తున్నాయన్నారు. టీచర్లను కూడా బదిలీ చేయలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి అని బొత్స వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు తాజాగా విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి.. అభినందనలు తెలియజేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో వీర మహిళలతో సమావేశం ఏర్పాటు చేసిన పవన్.. వారిని ఉద్ధేశించి ప్రసంగిస్తున్నారు.
జగన్.. నువ్వు చెత్త ముఖ్యమంత్రివి.. నీకు సంస్కారం లేదు.. నీకు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విధానాలను తీవ్రంగా తప్పు బట్టారు.
ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్ గదిలో నిద్రపోతున్న విద్యార్ధిని.. గుర్తు తెలియని అగంతకులు కిడ్నాప్ చేసి.. ఆపై హత్య చేసి స్కూల్ ఆవరణలోనే పడవేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా ఆ బాలుడి మృతదేహం చేతిలో మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందని వార్నింగ్ లెటర్ పెట్టడం గమనార్హం.
తిరుపతి జిల్లాలో జనసైనికులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన కామెంట్స్‌కు మద్దతుగా.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు కూడా రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తిలో నిరసన చేపట్టిన జనసేన శ్రేణులు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్ర భారీ జనసందోహం మధ్య దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ క్రమంలో నేడు తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ (Janasena Party) ప్రకటించింది.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లాలోని దర్శి దగ్గర సాగర్ కెనాల్ లో అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో 30 మందికి గాయాలయ్యాయి. పొదిలి నుంచి కాకినాడకు వివాహ రిసెప్షన్ కోసం వెళుతుండగా