Last Updated:

Janasena chief Pawan Kalyan: జగన్.. నువ్వు చెత్త ముఖ్యమంత్రివి.. నీకు సంస్కారం లేదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జగన్.. నువ్వు చెత్త ముఖ్యమంత్రివి.. నీకు సంస్కారం లేదు.. నీకు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విధానాలను తీవ్రంగా తప్పు బట్టారు.

Janasena chief Pawan Kalyan: జగన్.. నువ్వు  చెత్త ముఖ్యమంత్రివి.. నీకు సంస్కారం లేదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena chief Pawan Kalyan: జగన్.. నువ్వు చెత్త ముఖ్యమంత్రివి.. నీకు సంస్కారం లేదు.. నీకు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విధానాలను తీవ్రంగా తప్పు బట్టారు. పెళ్లాం అంటూ మాట్లాడతావేంటి? భార్య, సహధర్మ చారిణి అని మాట్లాడాలనే ఇంగితం లేదు. మధ్యయుగాల్లో విదేశాలనుంచి వచ్చిన వాళ్తు తప్ప మన పాలకులు మహిళలను ఏమీ అనలేదు.. చేయలేదు.. మాఫియా యుద్దాల్లో కూడా మహిళల జోలికి పోరు. నేను మాట్లాడుతుంది ఉపాధి అవకాశాల గురించి, భవన నిర్మాణ కార్మికుల గురించి, ఆడబడుచుల రక్షణ గురించి.. నేను వ్యక్తిగతంగా సీఎం జగన్ ను ఏమీ అనలేదు. కాని వైసీపీ మద్దతు దారులు సోషల్ మీడియాలో చాలా నీచంగా మాట్లాడుతున్నారు. జగన్ భార్య గురించి మేము ఎప్పుడూ మాట్లాడలేదు. మా వీర మహిళలను నీచంగా కామెంట్ చేస్తారు. వేధింపులకు గురిచేస్తారంటూ పవన్ కళ్యాణ్ విరుచుకు పడ్డారు.

మీ నాన్నలా 6 శాతం కమీషన్లు రాలేదు..(Janasena chief Pawan Kalyan)

మాట్లాడితే నేను హైదరాబాద్ లో ఉంటానని అంటావు. ఆంధ్రప్రదేశ్ డేటా హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా ఎఫ్ఒఏ ఏజన్సీ లో ఉంది. అక్కడ ఎందుకు పెట్టావు? మా నాన్న మీ నాన్నలా సీఎం కాదు. మీ నాన్నకు వచ్చినట్లు 6 శాతం కమీషన్లు రాలేదు. ఎక్సైజ్ డిపార్టుమెంట్లో సాధారణ ఉద్యోగి. మా కష్టం, అదృష్టం కలిసివచ్చి యాక్టర్లం అయ్యాం. నీలా అడ్డగోలుగా మైన్స్, ఇసుక దోపిడీలు చేయలేదు. నీ వాలంటీర్లకు అధిపతి ఎవరు? కొంతమంది వాలంటీర్లు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. తిరుపతిలో వాలంటీర్లు ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టబడ్డారు. రౌడీయిజం చేస్తున్నారు. అత్యాచారాలు కూడా చేస్తున్నారు. వాలంటీర్లు రెక్కీ చేస్తున్నారు. ఆడపిల్లలను టార్గెట్ చేస్తున్నారు. లొంగకపోతే పధకాలు ఇవ్వమని బెదిరిస్తున్నారు. గద్ద కాళ్లకింద కోడిపిల్లల్లా అయిపోయారు. పరువు పోతుందని తల్లిదండ్రులు బయటకు చెప్పుకోవడం లేదు. అలాంటి వారు పోలీసుస్టేషన్లకు వెళ్లండి. మీకు జనసేన అండగా ఉంటుంది. నేరం చేసిన వాడికి భయం లేదు. ఎందుకంటే మా జగనన్న నేరం చేసి జైలుకు వెళ్లి వచ్చి సీఎం అయ్యాడని వారు అంటున్నారు. జాతీయ ఉపాధి హామీ పధకం క్రింద పనిచేసే కూలీ కన్నా వాలంటీర్లకు వచ్చేది తక్కువ. వీరి జీతం బూంభూంకు ఎక్కువ ఆంధ్రా గోల్డ్ కు తక్కువ. ఒక మహిళా వాలంటీర్ నాకు ఫిర్యాదు చేసినందుకు ఆమె అన్నను చంపేసి శవాన్ని ఇంటికి పంపించారు. మద్యం మీద ఆదాయం వద్దన్న వ్యక్తి దానిమీద 1.30 వేల కోట్లు సంపాదించాడు. తండ్రి లేని బిడ్డ రోడ్ల మీద తిరుగుతున్నాడని గత ఎన్నికల్లో మీరు ఓట్లేసారు. కాని ఈ బిడ్డ లక్ష కోట్లు దోచేసాడు. తరువాత ఓట్లేసిన పాపానికి అందరి జీవితం దుర్బరం చేసాడు. ఆడబిడ్డలకు ఇష్టం లేనిచోట మాత్రం షాపులు ఉండవు. మగాళ్లు కోరిన చోట మద్యం ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.

 

నేను బీజేపీతో ఉన్నానో లేదా అనేది మైనారిటీలకు అనవసరం. నేను మీకు అండగా ఉంటానా లేదా అనేది ఆలోచించండి. సినిమాల్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ చేసాను. అందుకే జానీలో దళిత యువకుడిని, భీమ్లా నాయక్ లో గిరిజనుడిని హీరోగా చూపాను. పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్ల డబ్బులు కూడా దారి మళ్లించారు. 323.83 కోట్లు అప్పు చేసావు. బడ్జెట్లో చూపించలేదు. రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదు. ఈ డబ్బులు ఎక్కడికి పట్టుకెళ్లావు? ప్రజాస్వామ్యం అంటే జగన్ స్వామ్యం కాదు. స్దలాలు సేకరించకుండానే రూ.18 కోట్లు నొక్కేసావు. 4300 టిడ్కో ఇళ్లల్లో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. ప్రజల డేటా బయటకు పోతే, డేటా చోరీ అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? నీవు బాధ్యత వహిస్తావా? నీ మంత్రులు బాధ్యత వహిస్తావా? కేవలం ఐదువేల రూపాయల జీతంతో శ్రమదోపిడీ చేస్తున్నావు. పోలవరం ఎలాగా పూర్తి చేయలేవు.. ఎర్రకాలువ గండ్లు కూడా పూడ్చలేవు. ఉపాధి అవకాశాలు కల్పించవు. పరిశ్రమలు రానివ్వివు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తావు. యువత ఏం చేయాలి? మీ లాగ మీ నాన్న లాగా దోచుకున్న డబ్బు లేదు. పన్నులు తప్ప పనులు చేయవు. ఇసుక దోపిడిలో 40 వేల కోట్లు, అన్ని సిమ్మెంట్ కంపెనీలనుంచి 10 వేల కోట్లు, మిగతా వారి నుంచి 10 వేలకోట్లు దోచేసాడు. 2,700 మంది సైనికులు ఉన్న మిలట్రీ మాధవరానికి కనీస సౌకర్యాలు కల్పించలేదు. హీరో కృష్ణగారు చనిపోయినపుడు మహేష్ బాబు ఏడుస్తుంటే పరామర్శకని వెళ్లి జగన్ వెకిలి నవ్వులు నవ్వాడంటూ పవన్ విమర్శించారు

సొంత చెల్లిని, తల్లిని బయటకు పంపాడు..

సొంత బాబాయ్ ను చంపేసిన ముష్కరులు వారు. సొంత చెల్లిని, తల్లిని బయటకు పంపేసిన వాడు. అలాంటి వాడికి బయటవారి మీద ఎలా ఉంటుంది? నేను ఏడాదికి వెయ్యి కోట్ల దాకా సంపాదించగలను. నన్ను బెదిరిస్తున్నారు. అయినా ఎందుకు భరిస్తున్నానంటే మీ కోసం. యువతకోసం, చిరు వ్యాపారులకోసం, మహిళల భవిష్యత్తు కోసం. ఈ బుద్దిహీనుడికి, సంస్కార హీనుడికి తగిన జవాబివ్వాలి. జగన్ నువ్వు ఇంతవరకు రాజకీయ నాయకులతో పోరాడావు. విప్లవకారుడితో పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాను. ముఖ్యమంత్రి సతీమణిగారికి రెండు చేతులు జోడించి చెబుతున్నాను.. సంస్కారహీనుడయిన మీ ఆయనకు చెప్పండి. జగన్ తెలుగు నేర్చుకో. తెలుగు పాఠాలు నేర్పుతాను. పిండాకూడుకు, పిండివంటకు తేడా తెలియని వ్యక్తి. ఇలాంటి వ్యక్తి చేతిలో మనమున్నాము. ధర్మం మన వైపే ఉంది. 2024లో మన ప్రభుత్వమే వస్తుంది. అభివృద్ది జరగాలంటే, ఆరాచకం ఆగాలంటే జగన్ ప్రభుత్వం పోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.