Last Updated:

Independence Day 2023 : జనసేన నేతృత్వంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. వీరమహిళలలతో భేటీ అయిన పవన్

భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు. ప్రస్తుతం పార్టీ ఆఫీసులో జనసేన వీర మహిళలతో పవన్ సమావేశం అయ్యారు.

Independence Day 2023 : భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు. ప్రస్తుతం పార్టీ ఆఫీసులో జనసేన వీర మహిళలతో పవన్ సమావేశం అయ్యారు. అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం..

 

 

 

మంగళగిరిలో జనసేన నేతలు, వీర మహిళలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఫైరయ్యారు. సీఎం జగన్ పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. 30 వేల మంది మహిళల అదృశ్యంపై జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఆడపడుచులకు మాన, ప్రాణ రక్షణ ఉండాలన్నారు. 150 మంది పిల్లలను ట్రాఫికింగ్‌కు తరలిస్తే ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అవినీతి, అక్రమాలపై ప్రజలు గొంతెత్తి మాట్లాడాలని పిలుపునిచ్చారు.

వీర మహిళలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. స్త్రీ శక్తిని గౌరవించాలని.. మహిళలతో సమావేశం అయినట్లు పవన్ తెలిపారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను పార్టీ నడపగలుగుతున్నాని వెల్లడించారు. ఎవరి బలిదానంతో రాష్ట్రం ఏర్పడిందో.. వారికి గుర్తింపు లేదని పవన్ అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి.. ఆయన తండ్రికి కూడా గుర్తింపు ఇవ్వలేదన్నారు. ప్రతిచోటా సీఎం ఫోటో ఉంటుంది కానీ.. బలిదానాలు చేసిన వారి ఫోటోలు ఉండటం లేదన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పాఠాల్లో చేర్చాలని పవన్ కోరారు. మణిపూర్ ఘటనలో మహిళలే బలయ్యారని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు.