Last Updated:

CM Jagan: అవనిగడ్డలో సీఎం పర్యటన.. ఆ రైతులకు ఇక ఆనందమే..!

కృష్ణా జిల్లా అవనిగడ్డలో గత కొద్దికాలంగా నిషేధిత భూములకు సంబంధించి ఆ ప్రాంత ప్రజల పోరాటాలు చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి అనేక సార్లు వినతులు సమర్పించారు. కాగా ఎట్టకేలకు ప్రజల గోడు విన్న సీఎం జగన్ వారికి శుభవార్త చెప్పారు. నేడు ఆయన అవనిగడ్డలో పర్యటిస్తున్నారు.

CM Jagan: అవనిగడ్డలో సీఎం పర్యటన.. ఆ రైతులకు ఇక ఆనందమే..!

CM Jagan: కృష్ణా జిల్లా అవనిగడ్డలో గత కొద్దికాలంగా నిషేధిత భూములకు సంబంధించి ఆ ప్రాంత ప్రజల పోరాటాలు చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి అనేక సార్లు వినతులు సమర్పించారు. కాగా ఎట్టకేలకు ప్రజల గోడు విన్న సీఎం జగన్ వారికి శుభవార్త చెప్పారు. నేడు ఆయన అవనిగడ్డలో పర్యటిస్తున్నారు.

నిషేదిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలను ఆ ప్రాంత రైతులకు సీఎం అందజేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 10.55 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. తర్వాత అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. తదనంతరం 22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్‌ పత్రాలను రైతులకు జగన్‌ అందజేస్తారు. మధ్యాహ్నం 12.25 గంటలకు అవనిగడ్డ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.25 గంటకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు.

ఇదీ చదవండి: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి.. మునుగోడులో తీవ్ర కలకలం

ఇవి కూడా చదవండి: