Last Updated:

Ranganna : వాచ్‌మెన్ రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం

Ranganna : వాచ్‌మెన్ రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం

Ranganna  : మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న కొద్ది రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. రంగన్న మృతదేహానికి కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించి పూడ్చి పెట్టారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపట్టనున్నారు. సిట్ బృందంలో ఒక డీఎస్పీతోపాటు ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, ఆరు మంది కానిస్టేబుళ్లతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

శనివారం ఉదయం కడప నుంచి పులివెందులకు ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం, ఫోరెన్సిక్ టీం చేరుకుంది. పోలీసులు అనుమతితో తహసీల్దార్, వీఆర్వోల సమక్షంలో సమాధి తవ్వకాలు చేపట్టారు. పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రంగన్న రీ పోస్టుమార్టం నిర్వహించారు. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్ మెన్ రంగన్న మృతిపై అనేక అనుమానాలు ఉండటంతో పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. రీ పోస్టుమార్టం రిపోర్టులో ఏమైనా కీలక విషయాలు వెలుగులోకి వస్తే కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: