Last Updated:

Ghee Risks: నెయ్యిని ఎక్కువుగా తీసుకోవడం వల్ల ఈ బాధలు తప్పవు!

మనలో చాలా మంది నెయ్యి ఎక్కువుగా తీసుకుంటారు. కానీ నెయ్యి ఎక్కువుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం. నెయ్యిలో ఉన్న కొలెస్ట్రాల్ వల్ల హైపర్ కొలెస్ట్రాలేమియా ఇది గుండెకు హాని చేస్తుందని నిపుణులు వెల్లడించారు.

Ghee Risks: నెయ్యిని ఎక్కువుగా తీసుకోవడం వల్ల ఈ బాధలు తప్పవు!

Ghee: మనలో చాలా మంది నెయ్యి ఎక్కువుగా తీసుకుంటారు. కానీ నెయ్యి ఎక్కువుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం. నెయ్యిలో ఉన్న కొలెస్ట్రాల్ వల్ల హైపర్ కొలెస్ట్రాలేమియా ఇది గుండెకు హాని చేస్తుందని నిపుణులు వెల్లడించారు. నెయ్యిలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువుగా ఉంటాయి. కాబట్టి నెయ్యిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. నెయ్యిని తినే ఆహారంలో తక్కువ తీసుకోవడం మంచిది.

తక్కువ ఆవనూనె, ఆవు నెయ్యి ఎక్కువుగా తీసుకునే వారి రక్తంలో కొవ్వు, కొలెస్ట్రాల్‌ శాతం ఆరోగ్యంగా ఉంటాయని, ఐతే వీరు నెయ్యి తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు ఒక పరిశోధనలో వెల్లడించారు.

కానీ కొంతమంది నిపుణుల వెల్లడించిన ప్రకారం ఇది కూడా అంత చెడ్డది కాదు. శరీరం పనిచేయడానికి కొలెస్ట్రాల్ అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరంలో సెల్యులార్ కార్యాకాలపాలకు సహాయపడుతుంది. దీని ప్రకారం చూసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ సరైన మొత్తంలో ఉండటం అవసరం. ఒక చెంచా నెయ్యిలో 8 గ్రాముల కొవ్వు మరియు 33 గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటాయి. నెయ్యి తీసుకోవడం వల్ల ప్రేగులకు మేలుకలుగుతుంది. ఇది అల్సర్ మరియు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి: