Published On:

Mahindra Thar Sales: సేల్స్‌లో దూసుకుపోతున్న థార్.. మార్కెట్లో విపరీతమైన డిమాండ్.. జిమ్నీ, ఫోర్స్ గూర్ఖాలను దాటేసి..!

Mahindra Thar Sales: సేల్స్‌లో దూసుకుపోతున్న థార్.. మార్కెట్లో విపరీతమైన డిమాండ్.. జిమ్నీ, ఫోర్స్ గూర్ఖాలను దాటేసి..!

Mahindra Thar dominates Jimny and Gurkha Sales:  మార్చిలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఎస్‌యూవీల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో నిలిచింది. క్రెటా దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు కూడా. ఎస్‌యూవీలలో లైఫ్ స్టైల్ ఆఫ్ రోడింగ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ కూడా ఉంది. ఈ సెగ్మెంట్‌లో మహీంద్రా థార్ ఆధిపత్యం కనిపించింది. మార్చిలో 8,936 యూనిట్ల థార్ అమ్ముడయ్యాయి. టాప్ 10 ఎస్‌యూవీల జాబితాలో థార్ 9వ స్థానంలో నిలిచింది. లైఫ్‌స్టైల్ సెగ్మెంట్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఇది మారుతి జిమ్నీ. ఫోర్స్ గూర్ఖాతో పోటీపడుతుంది. మార్చిలో కేవలం 385 యూనిట్ల జిమ్నీ మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఈ రెండింటి మధ్య 8,551 యూనిట్ల తేడా ఉంది.

 

థార్ ఎస్‌యూవీ మహీంద్రాకు రెండవ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా మారింది. థార్, థార్ రాక్స్‌లకు అధిక డిమాండ్ కారణంగా, కంపెనీ ఉత్పత్తిని కూడా పెంచాల్సి వచ్చింది. ఆ కంపెనీ థార్,యు రాక్స్‌లను 30:70 నిష్పత్తిలో ఉత్పత్తి చేస్తోంది. ఉత్పత్తిని పెంచడం కూడా దాని వెయిటింగ్ పిరియడ్ తగ్గించడంలో సహాయపడింది. అయితే, కొన్ని ట్రిమ్‌ల కోసం వెయిటింగ్ పిరియడ్ ఇప్పటికీ అలాగే ఉంది. కొన్ని ట్రిమ్‌లపై ఇంకా 18 నెలలు అంటే ఒకటిన్నర సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంది.

 

థార్ రాక్స్ బేస్ వేరియంట్ MX1. ఈ ట్రిమ్‌లో అనేక గొప్ప ఫీచర్లు అందించారు. దాని ఫీచర్లు తెలియడానికి ఇంకా సమయం ఉంది. అలాగే, థార్ రాక్స్‌లో బలమైన భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీనికి 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది, ఇది గరిష్టంగా 162హెచ్‌పి పవర్, 330ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరొక డీజిల్ ఎంపిక కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 152హెచ్‌పి పవర్, 330ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.

 

థార్ రాక్స్ సేఫ్టీ విషయానికి వస్తే.. ఇందులో కెమెరా ఆధారిత లెవల్-2 అడాస్ సూట్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూవీ కొన్ని ఇతర భద్రతా ఫీచర్స్‌లో నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, 6 ఎయిర్‌బ్యాగ్స్, అన్ని ప్రయాణీకులకు 3-పాయింట్ సీట్ బెల్టులు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ , టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ ఉన్నాయి. ఆఫ్-రోడింగ్‌ను సులభతరం చేయడానికి, మహీంద్రా ఎలక్ట్రానిక్ లాకింగ్ రియర్ డిఫరెన్షియల్‌తో పాటు క్రాల్ స్మార్ట్ అసిస్ట్, ఇంటెల్లి టర్న్ అసిస్ట్‌లను కూడా అందిస్తోంది. మొత్తంమీద, ఈ ఫీచర్లన్ని దీనిని చాలా అధునాతన ఎస్‌యూవీగా చేస్తాయి.