Last Updated:

YS. Vivekananda : హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు వైఎస్‌ వివేకానంద హత్య కేసు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివేకా భార్య, కుమార్తెకు విచారణపై అసంతృప్తి ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

YS. Vivekananda : హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు వైఎస్‌ వివేకానంద హత్య కేసు

Y. S. Vivekananda Reddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివేకా భార్య, కుమార్తెకు విచారణపై అసంతృప్తి ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్న సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. హత్యకేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన ఆధారాలున్నాయని తెలిపింది. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని చెప్పింది.

జస్టిస్ ఎంఆర్.షా, జస్టిస్ నాగరత్నంలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. సాక్షులను నిందితులు బెదిరిస్తున్నందున తన తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టు కేసును విచారిస్తుందని స్పష్టం చేసింది.

2019 మార్చి 15 న వివేకానందరెడ్డి హత్య జరిగింది. తొలుత గుండెపోటుతో చనిపోయారని వార్తలు వచ్చినా ఆ తర్వాత హత్యగా తేలింది. అయితే కేసు విచారణపై వివేకా కూతురు సునీత అనుమానం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి: