Last Updated:

Ys Sharmila: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు..

Ys Sharmila: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు..

Ys Sharmila: తెలంగాణలో ముందుస్తు ఎన్నికలపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని షర్మిల అన్నారు. ఈ విషయం కేసీఆర్ కు బాగా తెలుసని.. ముందస్తు ఎన్నికలకు వెళితే కేసీఆర్ నష్టపోతారని ఆమె అన్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి
మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. వైఎస్ వివేకా హత్య కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ నెల 28 నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తామని షర్మిల అన్నారు. ఈ పాదయాత్ర చివరగా ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే మళ్లీ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ యాత్ర కేసీఆర్ కు అంతిమయాత్ర అవుతుందని షర్మిల విమర్శించారు.

ఈ పాదయాత్రకు పోలీసుల అనుమతి కోరుతామని అన్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా.. ముందుకు సాగుతామని షర్మిల ఉద్ఘాటించారు.

రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలను అంతం చేసేందుకే వైఎస్ ఆర్టీపీ ఉన్నట్లు షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయి అనే ఊహగానాలపై షర్మిల స్పందించారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేవన్నారు.

కేసీఆర్ ముందస్తుకు వెళితే.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది కాబట్టి.. కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకోరని షర్మిల అన్నారు.

ఇక కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ పై షర్మిల (YS Sharmila) విమర్శలు చేశారు.

ఓటుకు నోటు లో కేసులో రేవంత్ దొంగ అని.. కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ కు వ్యతిరేకత ఉందని అన్నారు.

ఆయన పదవీ కాపాడుకోవడం కోసమే ముందస్తు.. ఎన్నికలంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

భాజపాలో ఎదిగే వారిని బండి సంజయ్.. కిందకు లాగుతారని అన్నారు. బండి సంజయ్ కు అధికారమే ముఖ్యమని అన్నారు.

వైఎస్ హత్యపై షర్మిల కీలక వ్యాఖ్యలు..

రాష్ట్రంలో సంచలనం రేపిన వైఎస్ వివేక హత్యక షర్మిల పలు వ్యాఖ్యలు చేశారు.

వివేక హత్య జరిగి ఇన్ని రోజులైనా.. హంతకులు ఎవరో తేలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ హత్య కేసును వెంటనే తేల్చాలని.. సీబీఐని షర్మిల కోరారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఇంత అలసత్వం దేనికని ప్రశ్నించారు.

ఈ హత్య కేసులో వైఎస్ అవినాష్ కు సీబీఐ నోటీసులు అందించిన విషయం తెలిసిందే.

దీనిపై షర్మిల మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ ఈ కేసులో జోక్యం చేసుకోకూడదని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు సలహా ఇచ్చారు.

అధికార పార్టీ బలంతో.. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయపద్దని షర్మిల సూచించారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/