Last Updated:

America ..అమెరికాలో కాల్పుల కలకలం.. మూడురోజుల్లో 20 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికా కాల్పులమోతతో దద్దరిల్లుతోంది. అయోవాలోని డెస్ మోయిన్స్‌లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ఇద్దరు విద్యార్థులు మరణించగా ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు.

America ..అమెరికాలో కాల్పుల కలకలం.. మూడురోజుల్లో 20 మంది మృతి

America ..అగ్రరాజ్యం అమెరికా కాల్పులమోతతో దద్దరిల్లుతోంది.
అయోవాలోని డెస్ మోయిన్స్‌లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ఇద్దరు విద్యార్థులు మరణించగా ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు.
స్టార్ట్స్ రైట్ హియర్ కార్యక్రమంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
తక్షణమే అత్యవసర సేవలకు సమాచారం అందించి బాధిత వ్యక్తులకు ప్రధమచికిత్స అందించారు.
గాయపడిన ఉపాధ్యాయుడి పరిస్థితి విషమంగా ఉండటంతో సోమవారం మధ్యాహ్నం శస్త్ర చికిత్సకు తరలించారు.
కాల్పులు జరిగిన 20 నిమిషాల తర్వాత, సాక్షుల వివరణలతో సరిపోలిన కారును అధికారులు రెండు మైళ్ల దూరంలో ఆపారు.
ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనుమానితుల్లో ఒకరు కారు నుండి పారిపోయారని, అయితే K-9 ఉపయోగించి అధికారులు ఆ వ్యక్తిని ట్రాక్ చేయగలిగారని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన ఖచ్చితంగా లక్ష్యంగా జరిగింది. ఇది యాదృచ్ఛికం కాదని సార్జంట్ పాల్ పారిజెక్ అన్నారు.

కాలిఫోర్నియా కాల్పుల్లో ఏడుగురు  మృతి..(America )

మరోవైపు కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే జిల్లాలో మరొక కాల్పుల సంఘటన జరిగింది.
ఇందులో కనీసం 7 మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ప్రస్తుతం లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్పందించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మాంటెరీ పార్క్  కాల్పుల్లో  పదకొండుమంది మృతి.. (America )

లాస్ ఏంజిల్స్ సమీపంలోని మాంటెరీ పార్క్ నగరంలో శనివారం జరిగిన కాల్పుల్లో 11 మంది మరణించగా మరియు పలువురు గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10 గంటల తర్వాత లాస్ ఏంజిల్స్‌కు తూర్పున
13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాంటెరీ పార్క్‌లో ఈ సంఘటన జరిగింది.
మాంటెరీ పార్క్ లూనార్ న్యూ ఇయర్ ఫెస్టివల్ కోసం దాదాపు వేల మంది ప్రజలు అంతకుముందు నగరంలో గుమిగూడారు.
కాల్పులు జరిగిన వీధికి ఎదురుగా క్లామ్ హౌస్ సీఫుడ్ బార్బెక్యూ రెస్టారెంట్‌ను కలిగి ఉన్న సెయుంగ్ వోన్ చోయ్,
ముగ్గురు వ్యక్తులు తన వ్యాపారంలోకి ప్రవేశించి తలుపు లాక్ చేయమని చెప్పారు.
షూటర్ మెషిన్ గన్‌తో ఉన్నాడని డ్యాన్స్ క్లబ్‌లో షూటింగ్ జరిగిందని తాను నమ్ముతున్నానని చోయ్ చెప్పారు.
కాల్పులు జరిపిన తరువాత దుండగుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

రెండవదాడిని అడ్డుకున్న పోలీసులు..

కాలిఫోర్నియాలో సామూహిక కాల్పుల ఘటన జరిగిన ప్రదేశం నుండి 42 బుల్లెట్ కేసింగ్‌లను సేకరించారు
కాల్పులు జరిపిన దుండగుడు తరచుగా సందర్శించే డ్యాన్స్ హాల్‌కు వచ్చే వాడని తెలుస్తోంది.
అతను మరొక డ్యాన్స్ హాల్‌కు వెళ్లాడని అధికారులు తెలిపారు. అయితే అక్కడ రెండవ దాడి జరగకుండా నిరోధించారు.
ఆదివారం అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లినపుడు అతడు తనను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

2021లో యూఎస్ క్యాపిటల్‌లోకి కవాతు చేసిన గుంపులో చేరిన తర్వాత హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి

కార్యాలయంలో డెస్క్‌పై కాళ్లతో ఫోటో దిగినవ్యక్తికి కోర్టు శిక్ష విధించింది.

రిచర్డ్ బార్నెట్ జనవరి 6, 2021న స్పీకర్ కార్యాలయంలోని డెస్క్‌పై కుర్చీలో  వెనుకకు వంగి, తన బూట్లను డెస్క్ పై పెట్టుకుని ఉన్నాడు.

జో బిడెన్‌ను తదుపరి అధ్యక్షుడిగా ధృవీకరించడానికి సమావేశమైనప్పుడు శాసనసభను మూసివేయడానికి.

క్యాపిటల్ కార్యాలయాలు మరియు హాళ్లను మూసివేసేందుకు అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులతో అతను కలిసాడు

వాషింగ్టన్ కోర్టు బార్నెట్‌ను ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ సర్టిఫికేషన్‌ను అడ్డుకోవడం, చట్టవిరుద్ధంగా క్యాపిటల్‌లోకి ప్రవేశించడం

మరియు ప్రమాదకరమైన ఆయుధంతో క్రమరహితంగా ప్రవర్తించడం వంటి ఎనిమిది ఆరోపణలపై దోషిగా నిర్ధారించింది.

అతను 20 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటాడు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/