Last Updated:

Telugu CMs Sankranthi Wishes 2025: సంక్రాంతి విషెస్ చెప్పిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

Telugu CMs Sankranthi Wishes 2025: సంక్రాంతి విషెస్ చెప్పిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

Telugu States CMs Sankranthi Wishes 2025: తెలుగు ప్రజలందరికీ ఇరు రాష్ట్రాల సీఎంలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అలాగే కనుమ పండుగను అందరూ ఆనందంగా చేసుకోవాలని, పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అలాగే, ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లల్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటిమంది రైతులు, నిరుపేదల, వ్యవసాయ కూలీ కుటంబాల్లో సంక్రాంతి కొత్త వెలుగులు తెస్తుందన్నారు. రైతు భరోసా రూ.12వేలకు పెంచడం, వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందరమ్మ ఆత్మీయ భరోసా నగదు సాయం, ఆహార భద్రతను అందించే కొత్త రేషన్ కార్డులు, ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందని రేవంత్ అన్నారు.