RCB vs LSG: బెంగళూరు భారీ స్కోర్.. లక్నో లక్ష్యం 213 పరుగులు
RCB vs LSG: చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో రెండు గెలిచి.. ఒకటి ఓడిపోయింది.
RCB vs LSG: బెంగళూరు భారీ స్కోర్ సాధించింది. కోహ్లీ, డూప్లెసిస్, మాక్స్ వెల్ రాణించారు. దీంతో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కోహ్లీ 61 పరుగులు, డూప్లెసిస్ 79 పరుగులు చేశారు. వీరికి తోడు మాక్స్ వెల్ 59 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిసింది.
లక్నో బౌలింగ్ లో మిశ్రా, మార్క్ వుడ్ చెరో వికెట్ తీసుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
RCB vs LSG: బెంగళూరు భారీ స్కోర్.. లక్నో లక్ష్యం 213 పరుగులు
బెంగళూరు భారీ స్కోర్ సాధించింది. కోహ్లీ, డూప్లెసిస్, మాక్స్ వెల్ రాణించారు. దీంతో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కోహ్లీ 61 పరుగులు, డూప్లెసిస్ 79 పరుగులు చేశారు. వీరికి తోడు మాక్స్ వెల్ 59 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిసింది.
లక్నో బౌలింగ్ లో మిశ్రా, మార్క్ వుడ్ చెరో వికెట్ తీసుకున్నారు.
-
RCB vs LSG: సిక్సర్ల వర్షం.. అర్దసెంచరీ చేసిన మాక్స్ వెల్
సిక్సర్లతో మాక్స్ వెల్ చెలరేగిపోయాడు. 24 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 5 సిక్సులు ఉన్నాయి. 3 ఫోర్లు కూడా కొట్టాడు.
-
RCB vs LSG: ముగిసిన 18వ ఓవర్.. 183 పరుగులు చేసిన బెంగళూరు
ఆర్సీబీ పరుగుల వరద పారిస్తుంది. ఉనాద్కత్ వేసిన ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ప్రస్తుతం బెంగళూరు 181 పరుగులు చేసింది
-
RCB vs LSG: ముగిసిన 17వ ఓవర్.. 170 పరుగులు చేసిన బెంగళూరు
మాక్స్ వెల్, డూప్లెసిస్ రెచ్చిపోయి ఆడుతున్నారు. పోటీపడి పరుగులు రాబడుతున్నారు. ఫాప్ 54 పరుగులు, మాక్స్ వెల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
RCB vs LSG: సిక్సుల వర్షం.. అర్దసెంచరీ పూర్తి చేసుకున్న డూప్లెసిస్
ఆర్సీబీ బ్యాటర్లు సిక్సుల వర్షం కురిపిస్తున్నారు. వరుస సిక్సులతో డూప్లేసిస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
-
RCB vs LSG: 15వ ఓవర్.. మూడు భారీ సిక్సులు
15 ఓవర్లో మూడు భారీ సిక్సులు వచ్చాయి. వరుసగా రెండు సిక్సులను డుప్లేసిస్ కొట్టగా.. మరో సిక్సర్ మాక్స్ వెల్ కొట్టాడు. ఫాఫ్ కొట్టిన ఓ సిక్స్ ఏకంగా 115 మీటర్ల దూరం వెళ్లింది.
-
RCB vs LSG: 14వ ఓవర్.. ఓ ఫోర్, సిక్సర్ కొట్టి మాక్స్ వెల్
14 ఓవర్లు మాక్స్ వెల్ రెచ్చిపోయాడు. అమిత్ మిశ్రా వేసిన బౌలింగ్ లో వరుసగా ఫోర్, సిక్సర్ కొట్టాడు.
-
RCB vs LSG: ముగిసిన 13వ ఓవర్.. 100 పరుగులు దాటిన బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోర్ 100 పరుగులు దాటింది. 13 ఓవర్లకు 104 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్, మాక్స్ వెల్ ఉన్నారు.
-
RCB vs LSG: విరాట్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు
బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. 61 పరుగులు చేసిన కోహ్లీ అమిత్ మిశ్రా బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు. 96 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది.
-
RCB vs LSG: కోహ్లీ జోరు.. అర్దసెంచరీ చేసిన రన్ మెషీన్
కోహ్లీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. హోమ్ గ్రౌండ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 43 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి.
-
RCB vs LSG: కోహ్లీ జోరు.. పవర్ ప్లే లో బెంగళూరు 56 పరుగులు
పవర్ ప్లే లో బెంగళూరు జోరుగా ఆడింది. పవర్ ప్లే లో కోహ్లీ విధ్వంసం సృష్టించాడు. 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3సిక్సులు ఉన్నాయి.
-
RCB vs LSG: ఐదో ఓవర్.. 10 పరుగులు చేసిన బెంగళూరు
ఐదో ఓవర్లో బెంగళూరు 10 పరుగులు చేసింది. కృనాల్ వేసిన ఓవర్లో కోహ్లీ ఓ భారీ సిక్సర్ కొట్టాడు.
-
RCB vs LSG: నాలుగో ఓవర్లో 8 పరుగులు
ఆవేష్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్లు 8 పరుగులు వచ్చాయి. రెండు బంతులను కోహ్లీ ఫోర్లుగా మలిచాడు.
-
RCB vs LSG: మూడో ఓవర్లో 8 పరుగులు
బెంగళూరు మూడో ఓవర్లో 8 పరుగులు చేసింది. మూడు ఓవర్లకు 25 పరుగులు చేసింది.
-
RCB vs LSG: ముగిసిన రెండో ఓవర్.. 13 పరుగులు చేసిన బెంగళూరు
ఆవేష్ ఖాన్ వేసిన రెండో ఓవర్లు 13 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో కోహ్లీ ఓ సిక్సర్, ఫోర్ కొట్టాడు.
-
RCB vs LSG: ముగిసిన తొలి ఓవర్.. నాలుగు పరుగులు చేసిన బెంగళూరు
తొలి ఓవర్లో బెంగళూరు నాలుగు పరుగులు చేసింది. జయదేవ్ ఉనాద్కత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
-
RCB vs LSG: బెంగళూరు బ్యాటింగ్.. క్రీజులోకి విరాట్, డూప్లేసిస్
టాస్ ఓడి బెంగళూరు బ్యాటింగ్ కి దిగింది. ఓపెనర్లుగా విరాట్, డూప్లేసిస్ వచ్చారు.
-
RCB vs LSG: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), జయదేవ్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్
-
RCB vs LSG: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇదే
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్