Last Updated:

PV Sindhu Gold Medal: కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన సింధు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని సింధు ఓడించింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు.. రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో భారత షట్లర్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి పసిడిని ముద్దాడింది.

PV Sindhu Gold Medal: కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన సింధు

Commonwealth Games 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి మిచెలీని సింధు ఓడించింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు. రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో భారత షట్లర్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి పసిడిని ముద్దాడింది. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు. 2018లో రజతం సాధించింది. ఈ స్వర్ణంతో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మొత్తం 56 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి చేరింది.

కెనడా షట్లర్ నుంచి పీవీ సింధు ఆశించిన స్థాయిలో గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కెనడా క్రీడాకారిణి మిచెల్ లీపై పివి సింధు అనుభవం పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. తన అనుభవాన్ని ఉపయోగించి పీవీ గోల్డ్ మెడల్ మ్యాచ్‌ను సులభంగా గెలుచుకుంది. గోల్డ్ మెడల్ మ్యాచ్ గెలవడానికి పివి సింధుకు కేవలం 48 నిమిషాలు మాత్రమే పట్టింది. కెనడా షట్లర్ మిచెల్ లీపై పీవీ సింధుకిది తొమ్మిదో విజయం.

ఇవి కూడా చదవండి: