Home / తాజా వార్తలు
హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ క్రికెటర్ మిథాలీ, నటుడు నితిన్ వేర్వేరుగా భేటీ అయ్యారు. నోవాటెల్ హోటల్లో సుమారు గంట పాటు వీరిద్దరితోఆయన చర్చించారు.
తెలంగాణలో 972 గురుకులాలు ఉన్నాయని, 5 లక్షల మంది విద్యారులు ఉన్నారనిఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
భారీ వర్షాలకు పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. వరదల ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 343 మంది చిన్నారులతో సహా 937 మంది మృతి చెందారు. దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాక్ ప్రభుత్వం గురువారం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విట్టర్లో వందేభారత్-2 స్పీడ్ ట్రయల్ కోట-నాగ్డా సెక్షన్ మధ్య 120/130/150 మరియు 180 కి.మీగా ఉందని రాసారు.
మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇటీవల ఆగస్టు 26 నుంచి 75 ఏళ్లు పైబడిన వారు తమ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఉచిత ప్రయాణానికి వారు తమ టిక్కెట్లను ఆగస్టు 26లోపు బుక్ చేసుకున్నట్లయితే ఛార్జీల వాపసు పొందుతారు, 65 మరియు 75 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఎంపికచేసిన బస్సుల్లో టిక్కెట్ ఛార్జీలపై 50 శాతం రాయితీని పొందుతారు
దుబాయ్ నగరంలోని 80 మిలియన్ డాలర్ల బీచ్ సైడ్ విల్లాను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ కొనుగోలు చేసారు. అయితే ఈ డీల్ ను గోప్యంగా ఉంచారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ కాలేజీ చేపట్టనున్నారు . కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి సభ అనుమతి కోసం ఈ నెల 23న అనుమతిని తీసుకున్నారు. కానీ తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ 25 న నోటీసులు పంపించారు .
తమిళనాడులోని చెన్నైకు చెందిన ప్రతీక్ అనే 13 ఏళ్ల బాలుడు భావోద్వేగాలతో కూడిన రోబోను రూపొందించాడు. అతను తన రోబోకు 'రఫీ' అని పేరు పెట్టాడు మరియు ఇది సాధారణ ప్రశ్నలకు ప్రతిస్పందించడంతో పాటు తిట్టడం మరియు ఇతర మానవ భావాలను అర్థం చేసుకుంటుంది.
ఆమె ఓ సాధారణ కానిస్టేబుల్. విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతలతో తీరికలేని జీవితం. అయినా డీఎస్పీ కావాలని తను కన్నకలను సాకారం చేసుకునేందుకు ఏమాత్రం రాజీ పడకుండా రాత్రింబవళ్లు కష్టపడింది. తన పోరాట పటిమకు విధి సైతం తలవంచడంతో కానిస్టేబుల్ అనుకున్నది సాధించింది.
తమిళనాడులోని కోయంబత్తూర్లోని ఒక ట్రయల్ కోర్టు శుక్రవారం పాజీ ఫారెక్స్ సంస్థల డైరెక్టర్లు కె మోహన్రాజ్ మరియు కమలవల్లికి 27 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 171.74 కోట్ల సామూహిక జరిమానా విధించింది. వీరు రూ. 870.10 కోట్ల మేరకు డిపాజిటర్లనుమోసం చేసారు.