Home / తాజా వార్తలు
సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్‌కు ఊరట లభించింది. రోజువారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తనకు బదులు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలన్న జగన్ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది.
బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ ఆకస్మిక మరణం పట్ల కుటుంబసబ్యుల అనుమానాలు నిజమయ్యాయి. ఆమె పీఏ. అతని స్నేహితుడు కలిసి ఆమె చేత బలవంతంగా మత్తు పదార్దం తినిపించారని అది ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు.
వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ సభ నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతిచ్చింది. సభకు ప్రిన్సిపాల్ అనుమతి నిరాకరించడంపై బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు సభకు నిర్వహించుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీజేపీ నేతలు సభకు భారీ ఏర్పట్లు చేస్తున్నారు.
ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణలో భాగంగా, ఏపీలో ఇక నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పర్యావరణాన్ని రక్షిస్తూనే, ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు.
ఎఫ్ఎంసిజి సంస్థ మారికో 2024 నాటికి తన ఆహార శ్రేణుల నుండి రూ. 850-1,000 కోట్ల వ్యాపారాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో సౌగతా గుప్తా తెలిపారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా సఫోలా బ్రాండ్‌లో దూకుడును కొనసాగిస్తామని తెలిపారు.
నటుడు సోనూ సూద్, గత రెండు సంవత్సరాలుగా ప్రాథమిక మరియు విద్యాపరమైన వనరులను ఇవ్వడానికి తన స్వంత స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' అని పిలువబడే స్వచ్ఛంద సంస్థ ప్రవాసీ రోజ్‌గార్ మరియు ఇలాజ్ ఇండియా వంటి బహుళ పథకాలను కలిగి ఉంది.
ఆసియా కప్ లో దాయాది పాకిస్థాన్‌తో ఆదివారం రాత్రి టీమ్ ఇండియా తలపడుతోంది. పాక్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలుపొందిన తర్వాత రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. అయితే ఇండియాతో మ్యాచ్ కు ముందే పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని స్టార్ ప్లేయర్ ఒకరైన షాహీన్ అఫ్రిది మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని 43,000 దుర్గా పూజ కమిటీలకు ఒక్కొక్కదానికి రూ.60,000 ప్రకటించారు. అయితే ప్రకటన వెలువడిన వెంటనే ఆమె నిర్ణయానికి వ్యతిరేకంగా మూడు పిల్లు దాఖలయ్యాయి.
లులు గ్రూప్ ఛైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ 100 కోట్ల రూపాయలతో ప్రసిద్ధి చెందిన హెచ్145 ఎయిర్‌బస్ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. లులు గ్రూప్ భారతదేశంలో మరియు విదేశాలలో అనేక ప్రధాన నగరాల్లో అనేక మాల్స్‌ను కలిగి ఉంది. బుధవారం కొత్త హెలికాప్టర్ కేరళలోని కొచ్చిలో ల్యాండ్ అయింది.
ఏపీలో ఈ ఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రక్రియను కన్వీనర్ పోలా భాస్కర్ షెడ్యూల్ ప్రక్రియను ఆగష్టు 22న విడుదల చేసారు. ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకు సంబంధించిన ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుంది.