Last Updated:

All We Imagaine As Light: ఓటీటీకి లేటెస్ట్‌ అవార్డు విన్నింగ్‌ చిత్రం – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే

All We Imagaine As Light: ఓటీటీకి లేటెస్ట్‌ అవార్డు విన్నింగ్‌ చిత్రం – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే

All We Imagaine As Light OTT Release: అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయ్యింది. పాయల్‌ కపాడియా తెరకెక్కించిన ఈ చిత్రం ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ ఈ ఏడాది నవంబర్‌ 22న థియేటర్లోకి వచ్చింది. నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విడుదల ముందే పలు ఇంటర్నేషనల్‌ అవార్డులకు గెలుచుకుంది. ఇక రిలీజ్‌ తర్వాత పాజిటివ్‌ టాక్‌ అందుకుంది. అయితే కొన్ఇన వర్గాల నుంచి ఈ చిత్రంపై విమర్శలు వచ్చాయి.

కానీ ఇంటర్నేషనల్‌ ఫలిం ఫెస్టివల్లో ఈ మూవీ ప్రదర్శనకు కూడా వెళింది. ఇక ఈ చిత్రం విడుదలైన నెల రోజులైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్‌ చేసుకుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. జవనరి 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయ కదమ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా మలయాళంలో రూపొందిన ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ చిత్రాన్ని తెలుగులో హీరో రానా రిలీజ్‌ చేశారు.

తన నిర్మాణ సంస్థ స్పిరిట్‌ మీడియా సంస్థ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ముంబైలో ఇద్దరు మలయాళీ నర్సుల స్టోరీనే ఈ సినిమాగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. బోల్డ్‌ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాపై కొందరు విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఏడాది కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2024లో గ్రాండ్‌ ప్రిక్స్‌ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా 82వ గోల్డెన్ గ్లోబ్స్‌ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్‌ పిక్చర్‌), బెస్ట్‌ నాన్‌-ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ మోషన్‌ పిక్చర్‌ విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.