Home / తాజా వార్తలు
వినాయక చవితి వేడుకులకు ఖైరతాబాద్ మహా గణపతి ముస్తాబవుతున్నాడు. ఈ ఏడాది శ్రీ పంచముఖ లక్ష్మీగణపతి రూపంలో బొజ్జ గణపయ్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా 2016లో కెవిఐసి ఛైర్మన్ గా ఉన్నపుడు రూ. 1400 కోట్ల విలువైన నోట్లను మార్చుకోవాలని తన ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారని ఆప్ ఎమ్మెల్యే దురేగేశ్ పాఠక్ సోమవారం ఆరోపించారు. అతను కెవిఐసి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు, నోట్ల రద్దు జరిగింది, అక్కడ పని చేస్తున్న క్యాషియర్ తాను బలవంతంగా నోట్ల మార్పిడికి పాల్పడ్డానని లిఖితపూర్వకంగా తెలిపాడు అతనిని సస్పెండ్ చేయడం దురదృష్టకరం.
సీఎం కేసీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజులు చేసిన సీఎం కేసీర్ కలెక్టర్ ని కుర్చీలో కూర్చోపెట్టారు. కలెక్టరేట్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
రాబోయే రెండు నెలల్లో, దీపావళి నాటికి, మేము ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు చెన్నైతో సహా పలు కీలక నగరాల్లో జియో 5Gని ప్రారంభిస్తాము అంటై రిలయన్స్ ఇండస్టీస్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ముఖేష్ అంబానీ తెలిపారు.
వరదల ధాటికి పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరెంతోమంది నిరాశ్రయులయ్యారు. గత 24 గంటల్లోనే 119 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత ద్వారా సూపర్‌టెక్ లిమిటెడ్ రియల్టీ కంపెనీకి సుమారు 500 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం విషయానికి వస్తే నిర్మాణ వ్యయంతో పాటు బ్యాంకు వడ్డీలు తదితర అంశాలు కలిసి ఉన్నాయయని కంపెనీ చైర్మన్ ఆర్ కె అరోరా అన్నారు.
మాజీ రాజ్యసభ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి రామసేతులో నటించిన అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసును పంపించారు.
న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో తమ ఇంటివద్ద బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లైఫ్ సైజ్ విగ్రహాన్ని భారతీయ-అమెరికన్ కుటుంబం ఏర్పాటు చేసింది.ఎడిసన్‌లోని రింకు మరియు గోపీ సేథ్‌ల ఇంటి వెలుపల భారీ ఎత్తున ప్రజలు గుమికూడి పటాసులు కాల్చారు. గోపీ సేథ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటు నిబంధనలపై వివాదం సద్దుమణిగింది. గణేష్ ఉత్సవ్ కమిటీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఓ జాబితా విడుదల చేసింది. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం రుసుముల భారం మోపిందని వస్తున్న విమర్శలపై దేవాదాయశాఖ స్పందించింది. వినాయక మండపాలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని దేవాదాయశాఖ కమిషనర్ జవహర్ లాల్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో చేరడం కంటే బావిలో మునిగిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.